అయ్యో పాపి. మద్యం మత్తులో నరికివేత. భార్యను చంపి నాటకమాడిన భర్త. ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్.!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో, హనీఫ్ అనే వ్యక్తి మద్యం సేవించి తన భార్యతో తరచూ గొడవపడేవాడు.

సంఘటన జరిగిన రోజు కూడా జరిగిన ఘర్షణలో ఆవేశానికి లోనైన హనీఫ్, ఇంట్లో ఉన్న పదునైన కత్తిని తీసుకుని భార్య తల, మెడ భాగాలపై దారుణంగా నరికి హత్య చేశాడు. ఆ తర్వాత తనపై అనుమానం రాకుండా పోలీసుల వద్ద నాటకమాడాడు.

సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, మరణించిన మహిళ శరీరంలో ఉన్న గాయాల తీవ్రతను చూసి అనుమానించారు. ఇది సాధారణ ఘటన కాదని, పథకం ప్రకారం జరిగిన హత్య అని గ్రహించిన పోలీసులు, కేసును మరో కోణంలోకి తిప్పి తీవ్రంగా విచారించారు.

విచారణ సమయంలో, ఈ దంపతుల 5 ఏళ్ల కుమారుడు ఫైజాన్ ఇచ్చిన ప్రత్యక్ష వాంగ్మూలం కేసు గమనాన్నే పూర్తిగా మార్చివేసింది. “నాన్న తాగి వచ్చి అమ్మను కత్తితో నరికాడు” అని ఆ బాలుడు నిజం చెప్పడంతో, భార్యను చంపి నాటకమాడిన హనీఫ్‌ను పోలీసులు తక్షణమే అరెస్టు చేశారు.


Posted

in

by

Tags: