అరె పాపాత్ముడా.! వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కొట్టి చంపి.. మెట్లపై నుంచి పడిపోయిందని గుండెలు బాదుకుంటూ డ్రామా.. జైలు నుంచి వచ్చిన 2 నెలల్లోనే మరో హత్య.. భర్త ఎలా దొరికిపోయాడు..??

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన ఓ ప్రాంతంలో, తన భార్య ఇంటి మెట్లపై నుంచి కింద పడి చనిపోయిందని నాటకమాడిన భర్త అబద్ధం, పోస్టుమార్టం నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చింది.

భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెను కొట్టి చంపిన నేరానికి భర్తను పోలీసులు అరెస్టు చేశారు.

నాగ్‌పూర్‌కు చెందిన లక్ష్మి (33) బట్టల దుకాణంలో పనిచేస్తోంది. ఆమె భర్త రోషన్ కిషోర్ (42) రవాణా కార్యాలయంలో (ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్) ఏజెంట్‌గా ఉన్నాడు. లక్ష్మి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న రోషన్, గురువారం రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. తీవ్ర కోపంతో రోషన్, లక్ష్మి పుర్రె, తల పక్కభాగంలో విచక్షణారహితంగా దాడి చేశాడు.

దీంతో తీవ్ర అంతర్గత గాయాలైన లక్ష్మి స్పృహతప్పి కింద పడిపోయింది. వెంటనే ఆమెను మేయో ఆసుపత్రికి తీసుకెళ్లిన రోషన్, తన భార్య ఇంటి మెట్ల పైనుంచి పడిపోయిందని వైద్యులతో, పోలీసులతో అబద్ధం చెప్పాడు. పరీక్షించిన వైద్యులు లక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

కానీ, శుక్రవారం వచ్చిన పోస్టుమార్టం నివేదికలో లక్ష్మి మెట్ల పైనుంచి పడి చనిపోలేదని, తలపై బలమైన దెబ్బ తగలడం వల్ల ఏర్పడిన అంతర్గత గాయాలతోనే మరణించిందని నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు రోషన్‌ను అదుపులోకి తీసుకుని తీవ్రంగా విచారించగా, భార్యను కొట్టి చంపినట్లు అతడు అంగీకరించాడు.

ఈ హత్య కేసులో అరెస్టయిన రోషన్, గతంలో 2006లో జరిగిన ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి, కేవలం రెండు నెలల క్రితమే జైలు నుంచి బయటకు రావడం గమనార్హం. ప్రస్తుతం కపిల్‌నగర్ పోలీసులు రోషన్‌పై మళ్లీ హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *