“అరెరే! ఇంత దారుణమా?”. 80% గాయాలతో 7 రోజుల పాటు మృత్యువుతో పోరాడి భర్త మృతి.. భార్య చేసిన నీచమైన పని.. దిగ్భ్రాంతికరమైన అసలు నిజం..!!

పూణెలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తరుణంలో, ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ ప్రాంతంలో తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

బాగ్పత్ నగరం, పినోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజ్వాడ గ్రామానికి చెందిన రాజీవ్ భార్య నిషా, పక్క ఇంట్లో ఉండే విక్రాంత్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త రాజీవ్‌కు తెలియడంతో, అతను తన భార్య ప్రవర్తనను తీవ్రంగా మందలించి, గొడవకు దిగాడు.

దీంతో కోపంతో ఊగిపోయిన భార్య నిషా, తన ప్రియుడు విక్రాంత్‌తో కలిసి భర్తను అంతం చేయడానికి పక్కా ప్లాన్ వేసింది. పథకం ప్రకారం, ఆ రోజు రాజీవ్ తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. అతను మత్తులోకి జారుకోగానే, తన ప్రియుడిని ఇంటికి పిలిపించింది.

అనంతరం ఇద్దరూ కలిసి మత్తులో ఉన్న రాజీవ్‌పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. రాజీవ్ కేకలు విన్న బంధువులు వెంటనే అక్కడికి చేరుకుని, 80 శాతం గాయాలతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఏడు రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన రాజీవ్ చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, కసాయి భార్య నిషా మరియు ఆమె ప్రియుడు విక్రాంత్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. నిందితులకు కఠిన శిక్ష పడాలని ఆ గ్రామస్తులు ఆగ్రహంతో ఆందోళనలు చేస్తున్నారు. ఈ దారుణమైన వార్త సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది.


Posted

in

by

Tags: