కేవలం సినిమాల్లో మాత్రమే చూసి ఆశ్చర్యపోయే ఎన్నో సీన్లు, కొన్నిసార్లు నిజ జీవితంలోనూ ఎదురై అందరినీ విస్మయానికి గురిచేస్తుంటాయి.
ఆ కోవలోనే, తన ప్రేయసిని దక్కించుకోవడం కోసం ఎవరూ ఊహించని సమయంలో, అర్ధరాత్రి వేళ ఆమె ఇంట్లోకి ప్రవేశించి నుదుట కుంకుమ దిద్ది భార్యగా చేసుకుని, మరుసటి రోజు ఉదయం కొత్త పెళ్లికూతురితో కలిసి దర్జాగా బయటకు నడిచి వచ్చిన విజయ్ అనే యువకుడి సాహసం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వీరి ప్రేమకు పెద్దల వైపు నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం. అయితే, ప్రియురాలిని విడిచి ఉండలేకపోయిన ఆ యువకుడు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. ఊరంతా నిద్రపోతున్న నడిరాత్రి వేళ, ఎవరి కంటా పడకుండా రహస్యంగా తన ప్రియురాలి గదిలోకి వెళ్లాడు.
అక్కడే తన ప్రియురాలి నుదుట సింధూరం దిద్ది, ఆమెను తన అర్ధాంగిగా చేసుకుని ఆ రాత్రంతా అక్కడే గడిపాడు. మరుసటి రోజు తెల్లవారగానే, నుదుట మెరుస్తున్న కుంకుమతో ఆ యువతి తన ప్రియుడి చేతిని పట్టుకుని నవవధువులా గదిలోంచి బయటకు వచ్చిన దృశ్యాన్ని చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నోరెళ్లబెట్టారు.
అన్ని అడ్డంకులను అధిగమించి, ప్రేమించిన అమ్మాయిని భార్యగా చేసుకుని దర్జాగా చేయి పట్టుకుని తీసుకొచ్చిన ఆ యువకుడి సినిమా తరహా పెళ్లి.. ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
