“అర్థరాత్రి మాత్రమే తిరిగే దెయ్యమా?”.. గ్రామాన్ని వణికించిన వీడియో.. యువకుల అర్ధరాత్రి వేట.. బయటపడ్డ దిల్లుముల్లు.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!!

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, సతానా తాలూకాలోని అరై (Arai) గ్రామంలో గత కొద్దిరోజులుగా దెయ్యం తిరుగుతోందనే వార్త ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో.. ముఖం కనిపించని వింత ఆకారాలు నిర్మానుష్య ప్రాంతాల్లో, ఖాళీ స్థలాల్లో తిరుగుతున్నట్లు ఉన్న ఫోటోలు, వీడియోలు కార్చిచ్చులా వ్యాపించాయి. దీంతో భయపడిపోయిన గ్రామస్తులు సూర్యాస్తమయం అయిందంటే చాలు ఇళ్ల నుండి బయటకు రావడానికి గజగజ వణికిపోయారు.

అయితే, ఈ పుకార్ల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలని ఆ గ్రామ యువకులు మరియు పోలీసులు సాహసంతో రంగంలోకి దిగారు. అర్ధరాత్రి వేళ ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గంటల తరబడి వేచి చూసినా ఎక్కడా ఎటువంటి మర్మమైన ఆకారాలు కనిపించలేదు.

చివరకు జరిపిన లోతైన విచారణలో అసలు విషయం బయటపడింది. వైరల్ అయిన ఆ ఫోటోలన్నీ ‘AI’ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతను ఉపయోగించి సృష్టించినవని, ఆ వీడియోలు ఎక్కడో తీసిన పాత దృశ్యాలని తేలింది. సమాజంలో ఉద్దేశపూర్వకంగా భయాందోళనలు సృష్టించేందుకు టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూసి పోలీసులు విస్మయానికి గురయ్యారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై సైబర్ చట్టాల కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


Posted

in

by

Tags: