అర్ధరాత్రి 1:30 గంటల సమయం. “చెల్లెలి దగ్గర అది తీసుకుని రాత్రికి రాత్రే వెళ్లిపోయిన భర్త”. గడియ పెట్టి ఉన్న బెడ్‌రూమ్. భయంతో వణికిపోతూ అన్నయ్య వచ్చి తెరిచిన తలుపు.. లోపలి దృశ్యాన్ని చూసి హృదయాలు పగిలిపోయాయి..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో 27 ఏళ్ల వివాహిత శివాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

సోమవారం ఉదయం ఇంట్లోని గదిలో మంచంపై శివాని విగతజీవిగా పడి ఉండటం గుర్తించారు. ఆ తర్వాత ఆమె భర్త యశ్ ఠాకూర్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. శివాని కుటుంబ సభ్యులు ఆమె భర్తపై హత్య కేసు మోపుతూ, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి శివాని, ఆమె భర్త యశ్ ఠాకూర్ మధ్య ఏదో ఒక విషయంలో గొడవ జరిగినట్లు తెలిసింది. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, యశ్ ఠాకూర్ శివానిపై దాడి చేసేవాడని బంధువులు ఆరోపించారు. ఈ కారణంగానే గత రెండు, మూడు నెలలుగా శివాని పుట్టింట్లోనే ఉంటోందని సమాచారం. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 1:30 నుంచి 2:00 గంటల మధ్య శివాని చెల్లెలు ముస్కాన్ వద్ద తన బ్యాగు, ఇతర వస్తువులను తీసుకుని యశ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెళ్లే ముందు గది తలుపులను బయటి వైపు గడియ పెట్టి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తెల్లవారుజామున దాదాపు 5 గంటల సమయంలో ముస్కాన్ లేచి వాష్‌రూమ్‌కు వెళ్లబోతున్నప్పుడు గది తలుపులు బయటి వైపు గడియ పెట్టి ఉండటం గమనించింది. లోపల ఉన్నవారిని ఎంత పిలిచినా స్పందన రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ఆ తర్వాత ఉదయం 9 గంటల సమయంలో శివాని సోదరుడు అనికేత్ ఇంటికి వచ్చాడు. అతను గది తాళం తీసి చూడగా.. శివాని మంచంపై కదలిక లేకుండా పడి ఉన్నట్లు తెలిసింది. ఆమెను లేపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెంటనే మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.

దాదాపు ఏడాదిన్నర క్రితం సోషల్ మీడియా ద్వారా శివాని, యశ్ ఠాకూర్‌లకు పరిచయం ఏర్పడింది. మొదట స్నేహంగా ప్రారంభమైన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారడంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన ఏడాదిన్నర లోపే వీరి మధ్య అభిప్రాయ భేదాలు, ఘర్షణలు మొదలైనట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. వీరికి పిల్లలు లేరు. శివాని మృతి తర్వాత భర్త పరారవడంతో కుటుంబ సభ్యులు అతనిపై హత్య ఆరోపణలు చేశారు. అయితే, శివాని మరణం హత్యనా లేక వేరే కారణమా అనేది శవపరీక్ష నివేదిక, పోలీసుల పూర్తి దర్యాప్తు తర్వాతే వెలుగులోకి వస్తుంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *