అర్ధరాత్రి చొరబడిన ఎలుగుబంటి.. చెలరేగిన మంటల్లో చిక్కుకున్న కుటుంబం.. తుపాకీతో రంగంలోకి దిగిన అధికారులు.. కొలరాడోలో కలకలం.!!

అమెరికాలోని కొలరాడో రాష్ట్రం మౌంట్ క్రెస్టెడ్ బట్ ప్రాంతంలో గత ఆగస్టు 19వ తేదీ రాత్రి, ఓ ఇంటి కిటికీ అద్దాలను పగలగొట్టుకుని ఎలుగుబంటి లోపలికి చొరబడింది.

ఇంట్లోకి ప్రవేశించిన ఆ ఎలుగుబంటి అక్కడున్న ఫ్రిజ్, అల్మారాలు, వంట పాత్రలను ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టించింది. అంతేకాకుండా, వంటగదిలోని ఎలక్ట్రిక్ స్టవ్‌ను అది అనుకోకుండా ఆన్ చేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకుంది.

ఈ ప్రమాదకర పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ‘911’ నంబర్‌కు ఫోన్ చేసి అత్యవసర సేవా సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది, తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎలుగుబంటిని అక్కడి నుంచి తరిమేసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ఎలుగుబంటి బయటకు వెళ్లకుండా మొండికేయడంతో పాటు, ఇంట్లో చిక్కుకున్న కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడటానికి వేరే మార్గం లేకపోవడంతో అధికారులు దానిని తుపాకీతో కాల్చి చంపారు. ఆ తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చి, ఇంట్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *