అలా రా దారికి. అర్ధరాత్రి వరుసగా ఫోన్లను కొట్టేసిన దొంగ. తాడుతో కుర్చీకి కట్టేసి. పోలీసులకు అప్పగించిన సెక్యూరిటీ. మెచ్చుకుంటున్న నెటిజన్లు.!

ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో ఉన్న ఒక నివాస సముదాయంలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న గార్డుల సెల్‌ఫోన్లను అర్ధరాత్రి దొంగిలించడానికి యత్నించిన వ్యక్తిని, అక్కడున్న ఒక సెక్యూరిటీ గార్డు రాత్రికి రాత్రే పట్టుకున్నాడు.

సిసిటివి రికార్డింగ్‌ల ప్రకారం, తెల్లవారుజామున 2:38 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

అనుమానాస్పద వ్యక్తి ఆ ప్రాంతంలో ఇదివరకే నాలుగు నుండి ఐదు సెల్‌ఫోన్లను దొంగిలించినట్లు తెలుస్తోంది. మళ్లీ దొంగతనానికి పాల్పడటానికి ప్రయత్నించినప్పుడు, అప్రమత్తంగా ఉన్న సెక్యూరిటీ గార్డు అతడిని పట్టుకోవడానికి వెంటాడి విజయవంతంగా పట్టుకున్నాడు.

పట్టుబడిన వ్యక్తి తప్పించుకోకుండా ఉండేందుకు, సెక్యూరిటీ సిబ్బంది అతడిని తాడుతో కుర్చీకి కట్టేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 20 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న ముంబై పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు.


Posted

in

by

Tags: