“అవుటైనా పర్వాలేదు.. లేపి కొట్టు” తలా ధోని చెప్పిన ఆ ఒక్క మాట.. CSK టీమ్ సీక్రెట్‌ను బయటపెట్టిన శివమ్ దూబే..!!

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో తాను చేరడం గురించి, తన విధ్వంసకర బ్యాటింగ్‌కు తలా ధోని ఇచ్చిన ధైర్యమే కారణమని శివమ్ దూబే ఎంతో భావోద్వేగంతో పంచుకున్నారు.

దీని గురించి మాట్లాడిన శివమ్ దూబే, “నేను మొదటిసారిగా CSK టీమ్‌లోకి వచ్చినప్పుడు.. ‘స్పిన్నర్లు బౌలింగ్ చేయడానికి వస్తే రెండో ఆలోచనే వద్దు, బంతిని లేపి సిక్సర్‌ కొట్టు. ఒకవేళ అవుట్ అయినా పర్వాలేదు, దాన్ని నేను చూసుకుంటాను’ అని ధోని భాయ్ చాలా స్పష్టంగా చెప్పారు” అని తెలిపారు.

మరింతగా మాట్లాడుతూ, “ధోని భాయ్ నాకు ఇచ్చిన ఆ ఒక్క మాట, ఆ పెద్ద కాన్ఫిడెన్సే నన్ను ఒక అత్యుత్తమ పవర్ హిట్టర్‌గా (Power-Hitter) మార్చింది” అని ధోని మార్గదర్శకత్వాన్ని కొనియాడారు.

తలా ధోని చెప్పిన ఈ ఒక్క మాటతోనే శివమ్ దూబే ఐపీఎల్ టోర్నీలో ప్రత్యర్థి స్పిన్నర్లను భయం లేకుండా ఎదుర్కొనే విధ్వంసకర ప్లేయర్‌గా మారాడనే వార్త అభిమానులను మైమరిపిస్తోంది.


Posted

in

by

Tags: