“ఆ ఒక్క వీడియో కాల్.” భయాందోళనకు గురైన బంధువులు. భార్యను చంపి కాలువలో పడేసి.! మరుసటి క్షణమే భర్త తీసుకున్న తీవ్ర నిర్ణయం.. షాకింగ్ నేపథ్యం.!!”

కర్ణాటక రాష్ట్రం హళేబీడు సమీపంలో ఉన్న సనేనహళ్లికి చెందిన గగన (38) అనే మహిళకు, కేసగోడు గ్రామానికి చెందిన రఘు (41) అనే వ్యక్తికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి 12 మరియు 6 ఏళ్ల వయస్సు గల ఇద్దరు కుమారులు ఉన్నారు.

వీరు చిక్కమగళూరులో బేకరీ వ్యాపారం చేస్తూ కుటుంబంతో నివసిస్తున్నారు. శుక్రవారం నాడు తమ సొంత ఊరైన కేసగోడు గ్రామానికి ఇద్దరూ కారులో వెళ్తుండగా, మార్గమధ్యంలోనే రఘు తన భార్య గగనను దారుణంగా హత్య చేశాడు.

హత్య చేసిన వెంటనే తన బంధువులకు వీడియో కాల్ చేసిన రఘు, భార్యను చంపి మృతదేహాన్ని యాగచి కాలువలో పడేసినట్లు చెప్పి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాడు. అనంతరం తన గ్రామానికి వెళ్లిన ఆయన, అక్కడ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న అరేహళ్లి పోలీసులు రఘు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అలాగే యాగచి కాలువలో పడేసినట్లు చెబుతున్న గగన మృతదేహాన్ని కనుగొనడానికి సహాయక బృందాలతో కలిసి తీవ్ర గాలింపు చర్యలను వేగవంతం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *