రాజస్థాన్లోని అజ్మీర్ నగరంలో ఓ మహిళ ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని, వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించిన ఓ దొంగకు ఊహించని షాక్ ఎదురైంది. రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ను గమనించకుండా వేగంగా వెళ్లడంతో అతని ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
సంఘటన రోజున బాధిత మహిళ తన ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో నడుచుకుంటూ వెళ్తుండగా, ద్విచక్ర వాహనంపై ఆమెను వెంబడించిన దుండగుడు ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి వేగంగా పారిపోయేందుకు ప్రయత్నించాడు.
అనుకోని ఘటనతో షాక్కు గురైన మహిళ “దొంగ.. దొంగ.. కాపాడండి!” అంటూ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వెంటనే అతడిని పట్టుకునేందుకు పరుగులు తీశారు.
అదే సమయంలో వేగంగా వెళ్తున్న దొంగ రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ను గమనించకపోవడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో అతడు రోడ్డుపై కిందపడిపోయాడు.
అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు, అతడిని చుట్టుముట్టి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి అతడిని వారి చేతికి అప్పగించారు. దొంగ నుంచి మహిళకు చెందిన బంగారు గొలుసును కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితురాలికి తిరిగి అందజేశారు.
తన పని విజయవంతమైందని, ఇక తప్పించుకున్నానని భావించిన దొంగకు చివరికి ఆ ఒక్క స్పీడ్ బ్రేకర్నే అడ్డుకట్టగా మారింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారగా, దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించిన అజ్మీర్ స్థానికులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
