ఆండ్రాయిడ్ ఫోన్‌లో వెంటనే ‘ఈ’ సెట్టింగ్‌ మార్చండి; మీ ఫోన్ రాకెట్లా దూసుకుపోతుంది!

చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగిస్తుంటారు. అయితే చాలా స్మార్ట్‌ఫోన్లలో మెమరీ ఫుల్ అయినప్పుడు ఫోన్ స్లో అవ్వడం లేదా హ్యాంగ్ అవ్వడం ప్రారంభమవుతుంది. కేవలం స్టోరేజ్ వల్లే ఈ సమస్య వస్తుందని మనలో చాలా మంది అనుకుంటారు.

కానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్స్ వల్ల కూడా ఫోన్ నెమ్మదిస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘డెవలపర్ ఆప్షన్స్’ (Developer Options) అనే విభాగం ఉంటుంది. ఇది కేవలం డెవలపర్ల కోసమే అని అనిపించినా, ఇందులో సామాన్య వినియోగదారులకు ఉపయోగపడే సెట్టింగ్‌లు కూడా ఉన్నాయి. వీటిని సరిగ్గా సెట్ చేసుకుంటే మీ ఫోన్ ఎప్పుడూ స్లో అవ్వదు. ఆ సెట్టింగ్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.

ఫోన్ పనితీరును పెంచే సెట్టింగ్‌లు:

1. బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీలను పరిమితం చేయండి (Limit Background Processes): ఆండ్రాయిడ్ మల్టీటాస్కింగ్‌ను సులభతరం చేస్తుంది, కానీ ఇది ప్రాసెసర్ మరియు బ్యాటరీపై భారాన్ని పెంచుతుంది. డెవలపర్ మోడ్‌లోకి వెళ్లి ‘Background process limit’ ను 2 లేదా అంతకంటే తక్కువకు సెట్ చేయండి. దీనివల్ల ఒకేసారి ఎక్కువ యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వవు, ఫోన్ స్మూత్‌గా పనిచేస్తుంది.

2. లాగర్ బఫర్ సైజు తగ్గించండి (Reduce Logger Buffer Size): ఫోన్ మీ ప్రతి యాక్టివిటీని రికార్డ్ చేస్తుంది. దీని వల్ల మెమరీ మరియు సిపియు (CPU) పై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడిని తగ్గించడానికి ‘Logger buffer size’ ను 64K లేదా 256K కి మార్చండి. అవసరమైతే దీన్ని పూర్తిగా ఆఫ్ చేయవచ్చు.

3. యానిమేషన్ స్కేల్ మార్చండి (Change Animation Scale): యాప్స్ ఓపెన్ అయ్యేటప్పుడు లేదా మెనూలు వచ్చేటప్పుడు కనిపించే యానిమేషన్ల వల్ల ప్రాసెసింగ్ నెమ్మదిస్తుంది. డెవలపర్ ఆప్షన్స్‌లో ‘Window animation scale’, ‘Transition animation scale’, ‘Animator duration scale’ అనే మూడు ఆప్షన్లను 0.5x కి తగ్గించండి లేదా పూర్తిగా ఆఫ్ చేయండి. దీనివల్ల మీ ఫోన్ చాలా వేగంగా స్పందిస్తుంది.

4. ఫోర్స్ పీక్ రిఫ్రెష్ రేట్ (Force Peak Refresh Rate): మీకు బ్యాటరీ లైఫ్ కంటే ఫోన్ స్పీడ్ మరియు డిస్‌ప్లే స్మూత్‌నెస్ ముఖ్యమైతే.. ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయండి. దీనివల్ల సోషల్ మీడియా స్క్రోలింగ్ అనుభవం చాలా బాగుంటుంది.


Posted

in

by

Tags: