మహారాష్ట్రలోని లత్తూర్ నగరంలో ఆటో డ్రైవర్‌తో జరిగిన చిన్నపాటి గొడవ తీవ్ర రూపం దాల్చింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులపై కొందరు వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లత్తూర్‌లోని ఠాక్రే చౌక్ ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు బైక్‌పై వెళ్తుండగా, ఆటో డ్రైవర్‌తో వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత మరికొందరు అక్కడికి చేరుకుని విద్యార్థులతో గొడవకు దిగినట్లు పోలీసులు తెలిపారు.
వాగ్వాదం ముదరడంతో కొందరు వ్యక్తులు కొడవళ్లు, ఇతర ఆయుధాలతో విద్యార్థులపై దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులు గాయపడగా.. వారిని చికిత్స కోసం లత్తూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో ఠాక్రే చౌక్ ప్రాంతంలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఇదిలా ఉండగా.. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. అందులో కొందరు వ్యక్తులు విద్యార్థులపై దాడి చేస్తున్న దృశ్యాలు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించినట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై ఆటో డ్రైవర్‌తో పాటు మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిలో ఒకరు మైనర్ ఉన్నట్లు సమాచారం. నలుగురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
లత్తూర్ నగరంలో ఇలాంటి ఆయుధ దాడి ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికుల్లో మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply