తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామానికి చెందిన సర్పంచ్ నవీన్ – ఐశ్వర్య దంపతుల 4 ఏళ్ల కుమార్తె తన్విత శ్రీ.
ఆదివారం బడికి సెలవు కావడంతో, ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఆ చిన్నారి లాక్ చేయకుండా ఉన్న కారులోకి ఎక్కింది. ఆమె లోపలికి వెళ్లగానే కారు తలుపులు ఆటోమేటిక్గా లాక్ కావడంతో బయటకు రాలేక, ఊపిరి ఆడక స్పృహతప్పి పడిపోయింది.
చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, గ్రామస్తులు చుట్టుపక్కల అంతటా వెతకగా, చివరికి కారులోపల అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే చిన్నారిని బయటకు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆడుకుంటూ వెళ్లి అకారణంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ హృదయ విదారక ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతాపం వ్యక్తం చేయడంతో పాటు, చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ పోస్టులు పెడుతున్నారు.

Leave a Reply