ఆధార్ కేంద్రాల వద్ద క్యూలో నిలబడే తిప్పలు తప్పాయి.. సరికొత్త ‘Aadhaar App’ లాంచ్; ఇక చిటికెలో మీ పనులు!

భారత పౌరులకు ఆధార్ కార్డు అనేది అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం. పాఠశాలలు, కాలేజీలు, భూముల రిజిస్ట్రేషన్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పనుల వరకు ఆధార్ తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు వినియోగదారులకు ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది.

ఇకపై ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడం లేదా మార్చుకోవడం వంటి పనుల కోసం ఆధార్ సెంటర్లకు వెళ్లి గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. దీనికోసం UIDAI (Unique Identification Authority of India) జనవరి 28న సరికొత్త ‘ఆధార్ యాప్’ను ప్రారంభించింది. కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద ఈ యాప్‌ను ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు.

కొత్త ఆధార్ యాప్‌తో ఏయే పనులు చేయవచ్చు?

ఈ యాప్ పూర్తి వెర్షన్ అందుబాటులోకి రావడంతో మీరు ఈ క్రింది పనులను సులభంగా చేసుకోవచ్చు:

  • మొబైల్ నంబర్ అప్‌డేట్: ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండానే మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.
  • చిరునామా మార్పు: ఇంటి వద్ద నుంచే మీ కొత్త అడ్రస్‌ను అప్‌డేట్ చేయవచ్చు.
  • పేరు, ఈమెయిల్ మార్పు: మీ పేరు మరియు ఈమెయిల్ ఐడి వివరాలను సవరించుకోవచ్చు.
  • డిజిటల్ ఆధార్: ఫిజికల్ కార్డు వెంట ఉంచుకోవాల్సిన అవసరం లేదు. హోటళ్లు లేదా ఇతర చోట్ల యాప్‌లోని ఆధార్ చూపిస్తే సరిపోతుంది.
  • ఫేస్ ఆథెంటికేషన్ (Face Authentication): దీనివల్ల మీ ముఖ గుర్తింపుతోనే వెరిఫికేషన్ పూర్తవుతుంది, ఓటీపీల (OTP) గొడవ ఉండదు.
  • ఫ్యామిలీ ఆధార్: ఒకే యాప్‌లో కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులను భద్రపరుచుకోవచ్చు.
  • QR కోడ్ వెరిఫికేషన్: క్యూఆర్ కోడ్ ద్వారా మీ గుర్తింపును సులభంగా ధృవీకరించుకోవచ్చు.
  • భద్రత: ఈ యాప్ వల్ల ఆధార్ మోసాలకు అడ్డుకట్ట పడటమే కాకుండా మీ డేటా సురక్షితంగా ఉంటుంది.
మొబైల్ నంబర్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి?
  1. ఆధార్ యాప్‌ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి.
  2. హోమ్ స్క్రీన్‌పై ‘Update Aadhaar details’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  3. అక్కడ ‘Mobile Number’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
  4. కొత్త మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయండి.
  5. నిర్ణీత రుసుము (Fee) చెల్లిస్తే, వెరిఫికేషన్ తర్వాత మీ నంబర్ అప్‌డేట్ అవుతుంది.
యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
  • ఆండ్రాయిడ్ యూజర్లు Google Play Store లో, ఐఫోన్ యూజర్లు App Store లో ‘Aadhaar App’ అని సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • యాప్ ఇన్‌స్టాల్ అయ్యాక మీకు నచ్చిన భాషను ఎంచుకుని వెరిఫికేషన్ పూర్తి చేయండి.

Posted

in

by

Tags: