“ఆర్టీసీ బస్సు అని కూడా చూడకుండా ఇలా చేస్తున్నారేంటమ్మా!”.. చిన్న విషయానికే జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. భయంతో పరుగులు తీసిన తోటి ప్రయాణికులు.. వీడియో వైరల్..!!!

పరిగి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల మధ్య మొదలైన వాగ్వాదం కాస్తా తీవ్ర ఘర్షణగా మారి కొట్టుకునే వరకు వెళ్లింది.

మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళల బృందం, మరో మహిళపై అకస్మాత్తుగా దాడికి దిగి జుట్టు పట్టుకుని లాగుతూ బస్సులోనే తీవ్ర గందరగోళం సృష్టించింది.

బస్సులో ఒక్కసారిగా చెలరేగిన ఈ ఘర్షణతో తోటి ప్రయాణికులు, కండక్టర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వారిని శాంతింపజేసేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, సదరు మహిళలు ఎవరి మాటా వినకుండా కొట్టుకోవడం కొనసాగించారు. దీంతో భయాందోళనకు గురైన పలువురు ప్రయాణికులు మధ్యలోనే బస్సు దిగి వెళ్లిపోయినట్లు సమాచారం.

ఈ ఘర్షణను బస్సులోని ఓ ప్రయాణికుడు తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. పండుగ వేళల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలకే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ మహిళలు కొట్టుకోవడాన్ని చూసి నెటిజన్లు తీవ్ర విస్మయం, అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags: