ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోలా బ్లాక్ పరిధిలోని తాడీ ఖాస్ గ్రామంలో కుక్క కాటుకు గురై ఒక ఆవు మృతి చెందిన విచిత్ర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఆవు చనిపోయిందన్న వార్త గ్రామంలో దావానలంలా వ్యాపించడంతో, గ్రామస్తులు ఏం చేయాలో పాలుపోక తీవ్ర భయాందోళనలకు గురై ఒక్కసారిగా ప్రభుత్వ ఆసుపత్రి వైపు పరుగులు తీశారు.
సాధారణంగా గ్రామాల్లో పశువులు మరణించడం పెద్ద విశేషం కాకపోవచ్చు, కానీ ఈ ఘటన వెనుక ఉన్న అసలు నిజమే అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కుక్క కాటుతో మరణించిన ఆ ఆవు పాలతోనే స్థానిక ఆలయం కోసం ‘తీర్థం’ (చరణామృతం) తయారు చేశారు; దానిని గ్రామస్తులంతా భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. ఆవు చనిపోయిన విషయం తెలుసుకున్న ప్రజలు.. తాము కూడా ఆ పాలతో చేసిన తీర్థాన్ని సేవించినందున తమకు ఎక్కడ రేబిస్ సోకుతుందోనన్న తీవ్ర భయంతో ఆసుపత్రికి చేరుకుని వెంటనే టీకాలు వేయించుకున్నారు.
పరిస్థితి తీవ్రతను గ్రహించిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఒకే రోజు ఆసుపత్రికి పోటెత్తడంతో, ఇప్పటివరకు దాదాపు 450 మందికి పైగా టీకా వేయించుకున్నారు. ఈ వింతైన, దిగ్భ్రాంతికర సంఘటన ఆ ప్రాంతమంతా తీవ్ర భయాందోళనలకు, చర్చకు దారితీయగా, వైద్య బృందం అక్కడ ముమ్మర పర్యవేక్షణ చర్యలు చేపట్టింది.

Leave a Reply