ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన ఒక మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది.
కవల పిల్లలు పుట్టారనే సంతోషపడే సమయంలో, అందులో ఒక బిడ్డ ఆడపిల్ల అని తెలుసుకున్న ఆ మహిళ భర్త తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
ఆడపిల్ల పుట్టడాన్ని ఏదో పెద్ద నేరంగా భావించిన ఆ వ్యక్తి, ప్రసవించి మంచంపై ఉన్న భార్య ముఖంపైనే దారుణంగా దాడి చేశాడు. ఆసుపత్రి ప్రాంగణంలోనే జరిగిన ఈ ఘోర సంఘటన అక్కడి వైద్యులను, నర్సులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
గాయపడిన మహిళ ఆర్తనాదాలు విని పరిగెత్తుకు వచ్చిన ఆసుపత్రి సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. భార్యపై దాడి చేసిన నేరానికి గాను పోలీసులు ఆ వ్యక్తిని తక్షణమే అరెస్టు చేసి జైలుకు పంపారు.
కాన్పు అయి కొన్ని గంటలు కూడా కాకముందే ఒక తల్లిపై, అదీ ఆసుపత్రి మంచంపైనే దాడి చేసిన ఆ వ్యక్తి కిరాతక చర్య ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం, ఆగ్రహాన్ని రేకెత్తించింది. అయితే, ఈ కేసులో పోలీసులు విచారణ తీవ్రతరం చేసినప్పుడు ఒక దిగ్భ్రాంతికరమైన నిజం వెలుగులోకి వచ్చింది.
అరెస్టయిన ఆ వ్యక్తిపై ఇప్పటికే పలు నేర కేసులు పెండింగ్లో ఉన్నాయని, అతడిపై నాన్-బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయి ఉందని తెలిసింది. ఆడపిల్ల పుట్టిందనే కోపంలో భార్యపై దాడి చేసి అరెస్ట్ అవ్వడం ద్వారా, చాలా రోజులుగా తప్పించుకు తిరుగుతున్న పాత నేర కేసుల్లో కూడా అతడు ఇప్పుడు పోలీసులకు చిక్కాడు.

Leave a Reply