ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ క్రికెట్ సిరీస్.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ర్యాంకింగ్స్లో భారీ మార్పులకు దారితీసింది.
రెండో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టును ఇన్నింగ్స్, 31 పరుగుల తేడాతో ఓడించి దక్షిణాఫ్రికా జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది.
ఈ ఓటమితో ఆస్ట్రేలియా విజయాల శాతం (PCT) తగ్గినప్పటికీ, వారు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు.
మరోవైపు, ఈ విజయంతో దక్షిణాఫ్రికా జట్టు తన పాయింట్లను పెంచుకుని, అగ్రస్థానంలో ఉన్న జట్లతో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించుకుంది.
ప్రస్తుతం ఈ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ నాలుగో స్థానంలో, భారత జట్టు ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి.

Leave a Reply