డెహ్రాడూన్‌లోని ఓ హోమ్‌స్టే (Homestay)లో 5 రోజుల పాటు బస చేసిన ఓ జంట, గదిని ఖాళీ చేసి వెళ్లిన తర్వాత అక్కడి పరిస్థితిని చూసి ఆ హోమ్‌స్టే యజమాని తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు.
సాధారణంగా హోమ్‌స్టేలు లేదా హోటళ్లలో బస చేసి వెళ్లేటప్పుడు గదులు చిందరవందరగా, చెత్తగా ఉండటం సహజం. కానీ, ఈ జంట గదిని ఖాళీ చేసిన తర్వాత యజమాని లోపలికి వెళ్లి చూడగా, గది మొత్తం ఎంతో శుభ్రంగా, అందంగా సర్దిపెట్టి ఉంది.
ఫ్యాన్, ఏసీ, లైట్లు అన్నీ ఆఫ్ చేసి ఉండటమే కాకుండా, వస్తువులన్నీ ఎక్కడివక్కడ పద్ధతిగా పెట్టి ఉన్నాయి. చెత్తను కూడా డస్ట్‌బిన్‌లో సరిగ్గా వేసి, వంటగదిని కూడా అద్దంలా మెరిసేలా శుభ్రం చేసి ఉంచారు.
దీనిపై హోమ్‌స్టే యజమాని మాట్లాడుతూ.. “నేను గత 242 రోజులుగా ఈ హోమ్‌స్టేను నడుపుతున్నాను. కానీ, ఇలాంటి అతిథులను (Guests) నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వీరు చెక్-అవుట్ చేసి వెళ్లినట్లుగా లేదు, ఇప్పుడే కొత్తగా చెక్-ఇన్ చేసినట్లుగా గది అంత నీట్‌గా ఉంది” అని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ఆ జంట మంచితనాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఇలాంటి మంచి గెస్టులకు అద్దె డబ్బులు మొత్తం రీఫండ్ చేసేయొచ్చు!” అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply