ఇంటిని స్వర్గంలా మార్చే సులభమైన రహస్యాలు! వారం రోజుల్లో మీ జీవితం మారిపోతుంది!

  1. వెలుతురు మరియు గాలి:
    ఇల్లు ఎప్పుడూ వెలుతురుతో, ధారాళంగా గాలి ఆడేలా ఉండాలి. కిటికీలు తెరిచి ఉంచడం వల్ల ప్రకృతి సిద్ధమైన శక్తి ఇంట్లోకి వస్తుంది.
  2. ముంగిట అలంకరణ:
    మనం ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మొదట చూసేది ప్రధాన ద్వారం. వాకిలిని శుభ్రంగా ఉంచి, అందమైన ముగ్గులతో అలంకరించడం వల్ల సానుకూలత పెరుగుతుంది.
  3. నీరు మరియు పూలు:
    ఒక గాజు లేదా ఇత్తడి పాత్రలో (ఉరుళి) నీరు పోసి, అందులో తాజా పూలను వేసి అలంకరించండి. దీనిని 3 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇది ఇంటికి ఒక అందమైన వైబ్‌ని ఇస్తుంది.
  4. సువాసన (Aroma Therapy):
    మంచి సువాసన మన మనస్సును తక్షణమే ఆహ్లాదపరుస్తుంది. ప్రతిరోజూ సాంబ్రాణి లేదా అగరబత్తులు వేయడం వల్ల ఇల్లు ఒక పవిత్రమైన దేవాలయంలా అనిపిస్తుంది.
  5. స్ఫూర్తిదాయక వాక్యాలు (Motivational Quotes):
    మనం నీరసంగా ఉన్నప్పుడు చదవడానికి వీలుగా ఇంట్లో మంచి స్ఫూర్తినిచ్చే వాక్యాలను ఫ్రేమ్ కట్టించి తగిలించండి. ఇవి మీకు ఇన్‌స్టంట్ ఎనర్జీని ఇస్తాయి.
  6. అఫర్మేషన్స్ (Positive Affirmations):
    మీ జీవితంలో జరగాలనుకునే విషయాలను ఇప్పటికే జరిగినట్లుగా రాసి పెట్టుకుని, వాటిని చదువుతూ ఆ సంతోషాన్ని మనస్ఫూర్తిగా అనుభవించండి. దీనివల్ల మీ కోరికలు నిజమయ్యే అవకాశం పెరుగుతుంది.
  7. ఇండోర్ ప్లాంట్స్:
    ఇంట్లో మొక్కలను పెంచడం వల్ల గాలి శుద్ధమవ్వడమే కాకుండా, మనకు కావలసిన ఆక్సిజన్ అందుతుంది. ఇది శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
  8. గోడల శుభ్రత:
    మురికిగా ఉన్న గోడలు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. గోడలను శుభ్రంగా ఉంచుకోవడం లేదా ప్రకాశవంతమైన రంగులను వేయడం వల్ల ఇల్లు తాజాగా కనిపిస్తుంది.
  9. కుషన్లు మరియు ఫర్నిచర్:
    కుషన్ కవర్లను ఎప్పటికప్పుడు మారుస్తూ, శుభ్రంగా ఉంచడం వల్ల గదికి ఒక కొత్తదనం వస్తుంది.
  10. చిత్రపటాల ఎంపిక:
    ఇంట్లో ప్రకృతి దృశ్యాలు, జంతువులు, పూల చిత్రాలను మాత్రమే ఉంచండి. ఒంటరితనాన్ని లేదా విచారాన్ని సూచించే చిత్రాలు ప్రతికూల శక్తిని (Negative Vibes) కలిగిస్తాయి.
  11. బుద్ధుడి విగ్రహం:
    అలంకరణ కోసం బుద్ధుడి విగ్రహాన్ని ఎంచుకోవడం మంచిది. బుద్ధుడిని చూడగానే మనసులో ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది.
  12. నీటి లీకేజీలను అరికట్టండి:
    ఇంట్లో కుళాయిల నుండి నీరు కారుతూ ఉండటం ప్రతికూల శక్తికి సంకేతం. వెంటనే వాటిని మరమ్మత్తు చేయించండి.
  13. దిష్టి నివారణ (కర్పూరం మరియు ఆవాలు):
    వారానికి ఒకసారి మట్టి ప్రమిదలో రెండు కర్పూర బిళ్లలు, కొన్ని తెల్ల ఆవాలు వేసి వెలిగించి ఇల్లంతా చూపించడం వల్ల కంటి దిష్టి తొలగిపోతుంది.
  14. ఉప్పు మరియు నిమ్మకాయ:
    ఒక గాజు గ్లాసులో నీరు పోసి అందులో ఒక గుప్పెడు కల్లుప్పు, ఒక నిమ్మకాయ వేసి ఇంటి మూలలో ఉంచండి. మరుసటి రోజు ఆ నీటిని మార్చండి. ఇది ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని పీల్చుకుంటుంది.
  15. పసుపు మరియు కుంకుమ:
    ఒక నిమ్మకాయను రెండుగా కోసి, ఒక సగానికి పసుపు, ఇంకో సగానికి కుంకుమ పూసి వాకిలికి ఇరువైపులా ఉంచడం వల్ల దిష్టి తగలదు.
  16. పరిశుభ్రత:
    కనీసం 15 రోజులకు ఒకసారైనా ఇంటిని బూజు దులిపి శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోండి.

Posted

in

by

Tags: