ఇంట్లోనే ఘోరం.! 17 ఏళ్ల కూతురిపై పోలీసు తండ్రి అఘాయిత్యం. అబార్షన్ చేయించినా మారని బుద్ధి. 2022 నుంచి వరుస అత్యాచారాలు.. రెండో భార్య సంచలన ఫిర్యాదు.!

చెన్నై సచివాలయ క్వార్టర్స్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వేల్‌మురుగన్ (48), తన రెండో భార్యకు చెందిన 17 ఏళ్ల కూతురిపై నిరంతరం లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయ్యాడు.

చెన్నైకి చెందిన వేల్‌మురుగన్.. 2002లో పోలీసు శాఖలో విధుల్లో చేరాడు. ఇతనికి అప్పటికే వివాహమై మొదటి భార్య ఉండగానే, 46 ఏళ్ల మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ రెండో భార్యకు మొదటి భర్త ద్వారా 25 ఏళ్ల కుమారుడు, 17 ఏళ్ల కుమార్తె ఉన్నారు.

ఈ క్రమంలో, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకుని, ఆ 17 ఏళ్ల బాలికపై వేల్‌మురుగన్ నిరంతరం అత్యాచారానికి పాల్పడేవాడు. ఇతని బెదిరింపులు, అఘాయిత్యాల కారణంగా 2022 సంవత్సరంలో ఆ బాలిక గర్భం దాల్చింది.

దీంతో అప్రమత్తమైన వేల్‌మురుగన్, ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పొద్దని బాలికను తీవ్రంగా బెదిరించి, అరుంబాక్కంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి రహస్యంగా అబార్షన్ చేయించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కూడా బుద్ధి మారని ఆ కీచకుడు, బాలికను బెదిరిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

నిరంతర చిత్రహింసలు, బెదిరింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ బాలిక, తన తల్లి సహాయంతో నేరుగా మహిళా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కన్నీరుమున్నీరుగా ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు తీవ్రతను గుర్తించిన పోలీసులు, వెంటనే పోక్సో (POCSO) చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఈ దారుణానికి ఒడిగట్టిన హెడ్ కానిస్టేబుల్ వేల్‌మురుగన్‌ను అరెస్టు చేశారు. అంతేకాకుండా, అతనిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. ఖాకీ చొక్కా వేసుకుని ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికానే ఇలాంటి దారుణానికి పాల్పడటం చెన్నై పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *