“ఇక దాగుడు మూతలు వద్దు.. నేరుగా దెబ్బే!”. ఇరాన్‌లోకి చొరబడి దాడి చేసిన యూఏఈ (UAE) కమాండోలు.. గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తత!

దుబాయ్: మధ్యప్రాచ్యంలో ఇశ్రాయేల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం 9వ రోజుకు చేరుకుంది. అయితే, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ పోరులో ఐక్య అరబ్ ఎమిరేట్స్ (UAE) నేరుగా రంగంలోకి దిగింది.

ఏం జరిగింది?
ఇరాన్ చేస్తున్న దురాక్రమణలు మరియు ఇటీవలి క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా, యూఏఈ వైమానిక దళం ఇరాన్‌లోని కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.

ప్రధాన లక్ష్యం: ఇరాన్ ప్రజల దాహార్తిని తీర్చే అతిపెద్ద డీశాలినేషన్ ప్లాంట్ (సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే కేంద్రం) పై యూఏఈ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయని ఇశ్రాయేలీ వార్తా వెబ్‌సైట్ ‘Ynet’ సంచలన కథనాన్ని ప్రచురించింది.

ప్రతీకార చర్య: గత మార్చ్ 2వ తేదీన దుబాయ్‌లోని జెబల్ అలీ పోర్ట్ మరియు మంచినీటి ప్లాంట్ల సమీపంలో ఇరాన్ జరిపిన దాడులకు బదులుగానే యూఏఈ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇరాన్‌కు గట్టి హెచ్చరిక:
“మేము దేనికైనా సిద్ధమే” అని ఇరాన్‌కు స్పష్టం చేసేందుకే యూఏఈ ఈ హెచ్చరిక దాడికి దిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు అమెరికా, ఇశ్రాయేల్‌లతో తలపడుతున్న ఇరాన్‌కు, ఇప్పుడు పొరుగు దేశమైన యూఏఈ కూడా యుద్ధంలోకి దిగడం పెద్ద తలనొప్పిగా మారింది.

ఒకవేళ ఇరాన్ తిరిగి యూఏఈపై దాడి చేస్తే, పర్యవసానాలు ఇంకా తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ కావడంతో గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Posted

in

by

Tags: