ఇక పాస్‌పోర్ట్ ఉంటే చాలు… వీసాకు గుడ్ బై…! భారతీయులకు ఫ్రాన్స్ ప్రభుత్వం అధికారిక ప్రకటన!

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రందీర్ జైస్వాల్ వెల్లడించిన ఒక ముఖ్యమైన ప్రకటన ప్రకారం.. ఐరోపా దేశమైన ఫ్రాన్స్ మీదుగా ఇతర దేశాలకు ప్రయాణించే భారతీయులకు ఇప్పుడు ‘వీసా రహిత ట్రాన్సిట్’ (Transit) సౌకర్యం అమల్లోకి వచ్చింది.

భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వ్యక్తం చేసిన దృఢమైన నమ్మకానికి, దీర్ఘకాలిక భాగస్వామ్యానికి ఈ నిర్ణయం ప్రతిబింబంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఈ ముందడుగును భారత్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబైలో జరిగిన ఇరు దేశాల నేతల భేటీలో.. భారతీయ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఫ్రాన్స్ మీదుగా ప్రయాణించేటప్పుడు ట్రాన్సిట్ వీసా తప్పనిసరి అనే నిబంధనను తొలగించే విషయమై ఏకాభిప్రాయం కుదిరిందని ఆయన గుర్తు చేశారు.

ఈ మార్పు వల్ల భారతీయ ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి.


Posted

in

by

Tags: