మిడిల్ ఈస్ట్ యుద్ధం ఇప్పుడు ఒక భయంకరమైన మలుపు తిరిగింది. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన మరియు సురక్షితమైన నగరంగా భావించే ‘దుబాయ్’ ఇప్పుడు పొగచూరింది. ఇరాన్ ప్రస్తుతం ఇజ్రాయెల్ తర్వాత అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లక్ష్యంగా దాడులు చేస్తోంది.
ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లు నేరుగా దుబాయ్, అబుదాబిలోని పర్యాటక ప్రాంతాలను తాకాయి. లగ్జరీ హోటళ్ల నుండి విమానాశ్రయాల వరకు దేనినీ వదలలేదు. చివరికి బుర్జ్ ఖలీఫా పరిసరాల్లో క్షిపణులు పడటం అమెరికా మిత్రదేశమైన UAEకి కోలుకోలేని దెబ్బగా మారింది.
ప్రపంచం ముందు దెబ్బతిన్న UAE ప్రతిష్ట
అయాతుల్లా ఖమేనీ మరణానికి ప్రతికారం తీర్చుకోవడానికి, ఇరాన్ ఇప్పుడు అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశాలపై పడింది. బుర్జ్ ఖలీఫా నీడలో జరిగిన ఈ పేలుళ్లు భవనాలను మాత్రమే కాదు, ప్రపంచ ధనికులు పెట్టుబడులు పెట్టే UAE భద్రతా నమ్మకాన్ని కూడా ముక్కలు చేశాయి.
UAE పరిస్థితి ఎలా ఉంది?
చమురు శుద్ధి కర్మాగారాలపై దాడి: అబుదాబి సమీపంలోని చమురు నిల్వలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి.
పర్యాటకుల భయం: దుబాయ్‌లో నివసించే లక్షలాది మంది విదేశీయులు, ముఖ్యంగా భారతీయ వలసదారులు స్వదేశాలకు తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.
పెట్టుబడుల తరలింపు: భద్రతపై ఆందోళనలతో బహుళ జాతీయ కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలను దుబాయ్ నుండి సింగపూర్ లేదా భారత్‌కు తరలించే ఆలోచనలో ఉన్నాయి.
UAEపై ఇరాన్ ఆగ్రహానికి కారణం ఏంటి?
ఇరాన్ ఆగ్రహానికి ప్రధాన కారణం UAE గడ్డపై ఉన్న అమెరికా వైమానిక స్థావరాలు. తనపై దాడులకు ఏ దేశమైనా తన భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతిస్తే, తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ ముందే హెచ్చరించింది.
ప్రస్తుతం దుబాయ్ విమానాశ్రయాల్లో ప్రజల రద్దీ పెరిగిపోయింది, రియల్ ఎస్టేట్ మార్కెట్ కుప్పకూలింది. ఎప్పుడూ వెలుగులతో నిండి ఉండే నగరం ఇప్పుడు భయంతో నిశ్శబ్దంగా మారింది.

Leave a Reply