అమెరికా మరియు ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తున్నప్పటికీ, ఇరాన్ ఇంత బలంగా ఎలా తిరిగి కొడుతోంది? అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది.
దీని వెనుక రష్యా మరియు చైనాల భారీ ‘టెక్నాలజీ’ ఆట ఉన్నట్లు బయటపడింది. “మా మిత్రదేశాల సహకారం గురించి నేను బహిరంగంగా చెప్పలేను, కానీ ఆ బంధం నేటికీ కొనసాగుతోంది” అని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఇచ్చిన ఒక ప్రకటన ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది.
చైనా ఉపగ్రహాల నిఘా
చైనా తన వద్ద ఉన్న 500 కంటే ఎక్కువ ఉపగ్రహాల ద్వారా అమెరికా యుద్ధనౌకల యొక్క ఖచ్చితమైన స్థానాలను (Precision Location) ఇరాన్‌కు అందిస్తోంది. ముఖ్యంగా, అమెరికా హ్యాక్ చేయలేని ఒక సరికొత్త జీపీఎస్ (GPS) సాంకేతికతను చైనా ఇరాన్‌కు ఇచ్చింది. దీనివల్ల ఇరాన్ క్షిపణులను అమెరికా రాడార్లు దారి మళ్లించలేకపోతున్నాయి లేదా వాటి సిగ్నల్‌ను జాం (Jam) చేయలేకపోతున్నాయి.
రష్యా ‘కన్ను’.. ఇరాన్ గురి
మరోవైపు, రష్యా తన అత్యాధునిక ఉపగ్రహాన్ని పూర్తిగా ఇరాన్ సేవ కోసం కేటాయించింది. దీని ద్వారా ఇజ్రాయెల్ మరియు అమెరికా సైనిక స్థావరాల యొక్క హై-రిజల్యూషన్ ఫోటోలు ఇరాన్‌కు అందుతున్నాయి. ఈ సమాచారంతో ఇరాన్ అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దాడులను నిర్వహిస్తోంది. ఒకప్పుడు అజేయంగా భావించిన అమెరికా టెక్నాలజీకి రష్యా-చైనాల మద్దతుతో ఇరాన్ గట్టి సవాలు విసురుతోంది.
