వైద్య ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. కానీ, కొన్ని సంఘటనలు ఏకంగా సైన్స్‌కే, వైద్య నియమాలకే సవాలుగా నిలుస్తుంటాయి.
అలాంటి ఒక షాకింగ్ మెడికల్ కేసే ఇది. ఓ 15 ఏళ్ల బాలిక ‘ఓరల్ సెక్స్’ (నోటి ద్వారా జరిపిన శృంగారం) ద్వారా గర్భం దాల్చిన వింత ఘటన ఇది.
సాధారణంగా గర్భం దాల్చడం అనేది ప్రకృతి సహజమైన విషయం. కానీ, ఎలాంటి ప్రత్యక్ష శారీరక కలయిక లేకుండా, అందులోనూ పుట్టుకతోనే యోని మార్గం (Vaginal opening) లేని ఓ బాలిక గర్భం దాల్చడం వైద్యులనే ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇదేదో సినిమా కథో, కట్టుకథో కాదు.. ఆఫ్రికాలో నిజంగా జరిగిన, నేటికీ వైద్య చరిత్రలో ఆశ్చర్యంతో చెప్పుకునే ఒక అరుదైన సంఘటన. 1988వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా సరిహద్దులోని ‘లెసోతో’ (Lesotho) దేశానికి చెందిన ఓ 15 ఏళ్ల బాలిక, తీవ్రమైన కడుపునొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరింది.
ఆమెను పరీక్షించిన వైద్యులకు ఊహించని షాక్ తగిలింది. ఆ బాలిక తొమ్మిది నెలల గర్భవతి అని, ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయని తేలింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ బాలికకు పుట్టుకతోనే బాహ్య జననాంగం పూర్తిగా అభివృద్ధి చెందలేదు.
ప్రత్యక్షంగా శారీరక కలయిక జరిపేందుకు ఎలాంటి అవకాశం లేని ఆ బాలిక ఎలా గర్భవతి అయిందనే ప్రశ్న వైద్యులను తొలిచేసింది. వెంటనే ఆమెకు సిజేరియన్ (శస్త్రచికిత్స) చేసి, ఆరోగ్యకరమైన మగబిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. అయితే, ఈ వింత గర్భానికి కారణం ఏంటని ఆరా తీసిన వైద్యులకు ఓ సంచలన నిజం తెలిసింది.
ఆ బాలిక కొన్ని నెలల క్రితం ఒక వ్యక్తితో ఓరల్ సెక్స్‌లో పాల్గొంది. సరిగ్గా అదే సమయంలో, ఒక వ్యక్తి ఆమెను కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆ బాలిక కడుపులో లోతుగా దిగిన కత్తిపోటు కారణంగా, ఆమె జీర్ణాశయానికి, అంతర్గత అవయవాలకు మధ్య ఒక చిన్న రంధ్రం ఏర్పడింది.
నోటి ద్వారా ఆమె కడుపులోకి వెళ్లిన వీర్యకణాలు, ఆ కత్తిపోటు వల్ల ఏర్పడిన గాయం గుండా నేరుగా ఆమె ప్రత్యుత్పత్తి అవయవాలను (గర్భాశయాన్ని) చేరుకున్నాయని, తద్వారా ఆమె గర్భం దాల్చిందని వైద్యులు శాస్త్రీయంగా కనుగొన్నారు.
కోట్లలో ఒక్కరికి కూడా ఇలా జరిగే అవకాశం ఉండదు. వైద్యులను, శాస్త్రవేత్తలను సైతం నివ్వెరపరిచిన ఈ సంఘటన.. మానవ శరీరంలోని అనూహ్య పనితీరుకు నేటికీ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.

Leave a Reply