ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్‌లో, ‘పింకీ’ అనే 18 ఏళ్ల యువతికి ఓ వృద్ధుడితో రాత్రి 11 గంటల సమయంలో వివాహం జరిగినట్లు చెబుతున్న ఒక వీడియో ‘ఎక్స్’ (X) ప్లాట్ఫామ్లో వైరల్‌గా మారింది.
ఈ ఘటన గనక నిజమైతే, సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఆ యువతిని రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని.. ఒకవేళ కేవలం వీడియో వైరల్ కావడం కోసమే ఈ నాటకం ఆడి ఉంటే, దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తమకు షేర్ చేయాలని రాంపూర్ పోలీసుల అధికారిక ‘ఎక్స్’ ఖాతా కోరింది. మరోవైపు, ఆ యువతి తన సొంత ఇష్టప్రకారమే ఈ పెళ్లి చేసుకున్నట్లు చెబుతోందని మరికొందరు నెటిజన్లు కామెంట్ల రూపంలో అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply