సోషల్ మీడియాలో ప్రతిరోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని దృశ్యాలు మాత్రం మనల్ని ఒకేసారి నవ్వించడంతో పాటు భయంతో ఒళ్లు జలదరించేలా చేస్తాయి. అలాంటి ఓ ప్రమాదకరమైన స్టంట్ వీడియోనే ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
రాత్రి సమయంలో రోడ్డుపై అతి వేగంగా వెళ్తున్న ఓ పెద్ద బస్సు వెనుక, ఓ యువకుడు తన సైకిల్‌పై వెళ్తున్నాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అతను అసలు సైకిల్ పెడల్ తొక్కడమే లేదు.
తన ఒక కాలిని బస్సు వెనుక బంపర్‌పై పెట్టి, బస్సు వేగంతో పాటే తన సైకిల్‌ను కూడా 100 కి.మీ వేగంతో సాహసోపేతంగా నడుపుతున్నాడు. ఎలాంటి భయం లేకుండా చాలా తాపీగా అతను సైకిల్ నడుపుతున్న తీరు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
ఈ వీడియోపై “తమ్ముడు ఎల్ఐసీ (LIC) ఇన్సూరెన్స్ తీసుకున్నట్లున్నాడు!” అంటూ ఫన్నీగా రాసిన క్యాప్షన్ నెటిజన్లను మరింత నవ్విస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించి ఆశ్చర్యపోతున్నారు.
ఇది చూసిన కొందరు నెటిజన్లు “ఉచిత ప్రయాణంలో అసలైన మజా ఇదే” అని, మరికొందరు “హెల్మెట్ లేదు, పెడల్ తొక్కడం లేదు.. ఇది వేరే లెవల్ టెక్నాలజీ” అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Leave a Reply