“ఇన్‌స్టా యూజర్లకు పండగే..!” రీల్స్‌ను నేరుగా వాట్సాప్‌లో పంపేయొచ్చు.. మెటా తెస్తున్న అప్‌డేట్..!!

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ఇకపై చాలా సులభంగా వాట్సాప్‌లో షేర్ చేసేందుకు వీలుగా, మెటా (Meta) సంస్థ ఒక అదిరిపోయే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో నచ్చిన వీడియోలను వాట్సాప్‌లో పంపాలంటే, ఆ వీడియో లింక్‌ను కాపీ చేసి పంపడం లేదా ఆ వీడియోను విడిగా డౌన్‌లోడ్ చేసి పంపడం వంటి పద్ధతులే అందుబాటులో ఉన్నాయి.

ఈ శ్రమను తగ్గించేందుకు, మెటాలోని ‘అకౌంట్స్ సెంటర్’ (Accounts Center) ద్వారా యూజర్లు తమ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాలను వాట్సాప్‌తో అనుసంధానం (Link) చేసుకోవచ్చు.

ఇలా లింక్ చేసుకున్న తర్వాత, వాట్సాప్‌లో ఫోటోలు లేదా వీడియోలను ఎంచుకునే (Media Picker) విభాగంలోనే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ రీల్స్‌ను నేరుగా చూడవచ్చు.

అక్కడి నుంచే మీకు నచ్చిన రీల్స్‌ను స్నేహితులకు పంపవచ్చు లేదా నేరుగా వాట్సాప్ స్టேటస్‌గా కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం బీటా యూజర్ల (Beta Users) వద్ద పరీక్షిస్తున్న ఈ సదుపాయం, త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


Posted

in

by

Tags: