ఇరాన్ ఆకాశం నుండి కురుస్తున్న నల్లటి విషం.. ఆ చుక్క పడితే శరీరం కుళ్ళిపోతుంది! వీడియో చూస్తే శత్రువులైనా వణకాల్సిందే

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కూటమి విధ్వంసం సృష్టిస్తోంది. 9 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్ ఒంటరిగా పోరాడుతున్నప్పటికీ, ఆ దేశం లోపల పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. క్షిపణులు, డ్రోన్ల దాడుల మధ్య ఇప్పుడు ఇరాన్ ఆకాశం నుండి నల్లటి నీరు వర్షంలా కురుస్తోంది. ఈ నీటి చుక్క మనిషి శరీరంపై పడితే ఆ భాగం కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించిన వీడియో చూస్తుంటే శత్రువుల గుండెల్లో కూడా వణుకు పుడుతోంది.

ఇరాన్‌లో నల్లటి వర్షం: శనివారం రాత్రి టెహ్రాన్ ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో, ఇజ్రాయెల్ మరియు అమెరికా యుద్ధ విమానాలు ‘షహ్రాన్ ఫ్యూయల్ డిపో’, ‘అల్బోర్జ్’ ఆయిల్ రిఫైనరీలపై క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో నగరం నిప్పుల కొలిమిలా మారింది. అసలు భయం ఆదివారం ఉదయం మొదలైంది. సూర్యుడు ఉదయించినా వెలుతురు కనిపించలేదు. ఆకాశమంతా విషపూరితమైన నల్లటి పొగతో నిండిపోయింది. హఠాత్తుగా అక్కడ ‘చమురు వర్షం’ కురవడం ప్రారంభమైంది.

ఈ విషపూరిత వర్షం పడితే ఏమవుతుంది? ఆదివారం ఉదయం కురిసిన వర్షం తెల్లగా కాకుండా, చిక్కటి నలుపు రంగులో ఉండి చమురు వాసన వస్తోంది. దాడుల వల్ల గాలిలోకి విడుదలైన లక్షలాది గ్యాలన్ల చమురు, విష రసాయనాలు మేఘాలతో కలిసి ఈ ‘టాక్సిక్ కాక్టెయిల్’గా మారాయి. ఇరానియన్ రెడ్ క్రిసెంట్ హెచ్చరికల ప్రకారం.. ఈ వర్షంలో సల్ఫర్, నైట్రోజన్ ఆక్సైడ్లు ఉన్నాయి. ఇది ఎంతటి గాఢత కలిగిన ఆమ్లం అంటే, దీనివల్ల చర్మం కాలిపోవడమే కాకుండా ఊపిరితిత్తులు శాశ్వతంగా దెబ్బతింటాయి. అందుకే ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని, ఏసీలు కూడా ఆన్ చేయవద్దని అధికారులు హెచ్చరించారు.

కువైట్, బహ్రెయిన్‌లపై ఇరాన్ ప్రతీకారం: మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన ఫ్యూయల్ ట్యాంకులపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. అలాగే బహ్రెయిన్‌లోని వాటర్ ప్లాంట్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంది. తమ దేశ వనరులను నాశనం చేస్తే, మొత్తం ప్రాంతానికి నీటిని అందించే వనరులను కూడా వదలబోమని ఇరాన్ నేరుగా హెచ్చరిస్తోంది.


Posted

in

by

Tags: