ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి: మోదీ ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు.. అసలేం జరిగింది?

భారత్‌లో జరిగిన ‘మిలన్ 2026’ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌక ‘IRIS దేనా’పై అమెరికా సబ్‌మెరైన్ టార్పెడోతో దాడి చేసి ముంచివేసింది. ఈ ఘటనలో సుమారు 100 మందికి పైగా నావికులు మరణించగా, మరికొందరు అదృశ్యమయ్యారు. ఈ ఉదంతం ఇప్పుడు భారత్‌లో రాజకీయ దుమారాన్ని రేపుతోంది.

ఇరాన్ విదేశాంగ మంత్రి స్పందన:
ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. “భారత నౌకాదళానికి అతిథిగా వచ్చిన నౌకపై, ఎటువంటి హెచ్చరిక లేకుండా అంతర్జాతీయ జలాల్లో అమెరికా దాడి చేయడం నేరం. దీనికి అమెరికా భారీ ధర చెల్లించుకోవాల్సి ఉంటుంది” అని ఆయన హెచ్చరించారు.

మోదీ ప్రభుత్వంపై విపక్షాల ప్రశ్నలు:
భారత ఆహ్వానం మేరకు వచ్చిన అతిథి నౌకపై దాడి జరిగినా ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

సుప్రియా శ్రీనేత్ (కాంగ్రెస్): “మన అతిథులుగా వచ్చిన వారిని అమెరికా చంపేస్తుంటే ప్రధాని మౌనం వహించడం దేశానికి అవమానకరం.”

సంజయ్ సింగ్ (ఆప్): “రాష్ట్రపతి సమక్షంలో ఈ నౌక గొప్పతనాన్ని వివరించారు. అలాంటి నౌకను అమెరికా కూల్చివేసినా ప్రభుత్వం స్పందించకపోవడం పిరికితనం.”

కంవల్ సిబల్ (మాజీ విదేశాంగ కార్యదర్శి): “శిక్షణ విన్యాసాల ప్రోటోకాల్ ప్రకారం ఆ నౌకలో ఎలాంటి ఆయుధాలు లేవు. నిరాయుధంగా ఉన్న అతిథి నౌకను అమెరికా లక్ష్యంగా చేసుకోవడం భారత్ పట్ల అగౌరవమే.”

భారత ప్రభుత్వం మరియు నౌకాదళం వివరణ:
ఈ ఘటనపై వస్తున్న కొన్ని వార్తలను ప్రభుత్వం ఖండించింది.

PIB ఫ్యాక్ట్ చెక్: అమెరికా తన దాడుల కోసం భారత నౌకాదళ స్థావరాలను వాడుకుంటోందన్న వార్తలను ప్రభుత్వం ‘అబద్ధం’ అని తేల్చి చెప్పింది.

భారత నౌకాదళం: మార్చి 4న ఇరాన్ నౌక నుండి సహాయం కోరుతూ సందేశం రాగానే, శ్రీలంక నేవీతో కలిసి తాము రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని తెలిపింది. INS తరంగిణి, INS ఇక్షక్ వంటి నౌకలను సహాయక చర్యల కోసం పంపినట్లు స్పష్టం చేసింది.


Posted

in

by

Tags: