ఇరాన్‌కు 12 దేశాల చెక్..! కతార్‌పై భీకర దాడులతో ఉద్రిక్తత. ఏకమైన ప్రపంచ దేశాధినేతలు.. ఆకస్మిక ప్రకటనతో కలకలం..!!

పశ్చిమాసియా మరియు గల్ఫ్ దేశాలలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించడానికి, ఇరాన్ వెంటనే తన దాడులను నిలిపివేయాలని అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు ఉమ్మడిగా డిమాండ్ చేశాయి.

గత ఫిబ్రవరి 28న, అమెరికా మరియు ఇజ్రాయెల్ దళాలు కలిసి ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల పరంపరలో ఇరాన్‌లో మహిళలు, పిల్లలతో సహా వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దీనికి ప్రతికారంగా.. ఇజ్రాయెల్, అమెరికా మరియు గల్ఫ్ దేశాల్లోని వారి సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ తీవ్రమైన దాడులు చేస్తోంది. దీనివల్ల ఆ ప్రాంతంలో భద్రతా వాతావరణం ప్రశ్నార్థకంగా మారింది.

ఈ క్లిష్ట పరిస్థితిపై చర్చించడానికి సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో నేడు అత్యవసర ఆలోచనా సమావేశం జరిగింది. ఇందులో సౌదీ అరేబియా, ఈజిప్ట్, జోర్డాన్, కువైట్, కతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), బహ్రెయిన్, లెబనాన్, సిరియా, టర్కీ, అజర్‌బైజాన్ మరియు పాకిస్థాన్.. ఇలా మొత్తం 12 దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం ఇరాన్‌కు విధించిన ప్రధాన నిబంధనలు:

  • ఇరాన్ చేపడుతున్న అన్ని రకాల క్షిపణి మరియు వైమానిక దాడులను ఎటువంటి షరతులు లేకుండా వెంటనే నిలిపివేయాలి.
  • ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) తీర్మానాలకు ఇరాన్ పూర్తిస్థాయిలో కట్టుబడి ఉండాలి.
  • పొరుగు దేశాల సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించడం లేదా హింసను ప్రేరేపించడం వంటి చర్యలకు ఇరాన్ దూరంగా ఉండాలి.
  • అరబ్ దేశాలలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ అందిస్తున్న ఆర్థిక సాయం, ఆయుధ సరఫరా మరియు ఇతర మద్దతులను పూర్తిగా నిలిపివేయాలి.

ఇరాన్ చర్యలు పొరుగు దేశాల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని, మొత్తం ప్రాంతం యొక్క శాంతిని దెబ్బతీస్తున్నాయని ఆ ఉమ్మడి ప్రకటనలో ఆరోపించారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలంటే ఇరాన్ సహకరించాలని ఈ 12 దేశాలు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డాయి.


Posted

in

by

Tags: