కార్క్: ఐరోపాలోని ఒక అందమైన మరియు ప్రశాంతమైన దేశం ‘రెండో పాకిస్తాన్’గా మారుతోందా? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐర్లాండ్‌లోని ‘కార్క్ సిటీ హాల్’ (Cork City Hall) నుండి బయటకు వచ్చిన ఒక ఫోటో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
నిజానికి, ఈ ఫోటో రెండు మూడేళ్ల క్రితం నాటిదని చెబుతున్నారు. అయితే, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అంశాలపై రాసే ఒక ప్రముఖ ఫ్రెంచ్ ఎక్స్ (X) ఖాతా దీనిని మళ్లీ షేర్ చేయడంతో పాత చర్చ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ఐర్లాండ్‌లో పరిస్థితులు గతంలో కంటే దారుణంగా మారాయని ఆ పోస్ట్ పేర్కొంది.
ప్రభుత్వ కార్యాలయంలో ‘మినీ పాకిస్తాన్’
ఫ్రెంచ్ నిపుణులు షేర్ చేసిన ఈ ఫోటో ‘కార్క్ సిటీ కౌన్సిల్’ అధికారిక సమావేశానికి సంబంధించినది. ఈ ఫోటోలో ఐర్లాండ్ సొంత జెండా ఒక మూలన నిర్లక్ష్యంగా పడి ఉంది. కానీ, ప్రధాన గోడపై మరియు హాల్ అంతటా పాకిస్తాన్ దేశపు పచ్చని ‘చందమామ-నక్షత్రం’ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇది ఐర్లాండ్ కార్యాలయంలా కాకుండా పాకిస్తాన్‌లోని ఏదో ఒక ఆఫీసులా కనిపిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ వివాదం మొదలైనప్పుడు ‘సాంస్కృతిక వైవిధ్యం’ అని సరిపెట్టినప్పటికీ, నేడు పరిస్థితులు విషమిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మారిపోతున్న ఐర్లాండ్ జనాభా ముఖచిత్రం
ఒకప్పుడు ఐర్లాండ్ తన ప్రత్యేక సంస్కృతికి పేరుగాంచింది. కానీ గత కొన్నేళ్లుగా ఐరోపా యేతర దేశాల నుండి, ముఖ్యంగా పాకిస్తాన్ నుండి వలస వస్తున్న వారి సంఖ్య భారీగా పెరగడంతో దేశ చిత్రపటమే మారిపోతోంది. తమ ఐరిష్ గుర్తింపు మెల్లగా కనుమరుగవుతుందేమోనని స్థానికులు భయపడుతున్నారు. ఇటీవలి కాలంలో వలసదారులతో ముడిపడి ఉన్న నేరాల వార్తలు ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచాయి. దేశంలో నివాస గృహాల కొరత తీవ్రంగా ఉన్న సమయంలో, వలసదారులకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంతటి ప్రాధాన్యత ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ఆగ్రహం
ఈ పాత ఫోటో మళ్లీ వైరల్ కావడంతో చర్చ ఇప్పుడు ‘వలసల’ నుండి ‘జాతీయ గౌరవం’ వరకు వెళ్లింది. కేవలం ఓట్ల కోసమే స్థానిక అధికారులు విదేశీ వర్గాలకు తమ దేశ జెండా కంటే ఎక్కువ గౌరవం ఇస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. “సిటీ హాల్ పరిస్థితి ఇలా ఉంటే, భవిష్యత్తులో ఐర్లాండ్ పార్లమెంటులో కూడా పాకిస్తాన్ జెండాలు చూస్తామా?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
‘ఐర్లాండ్ ఫర్ ద ఐరిష్’: కొత్త జాతీయవాదం
ఈ ఫోటో ఐర్లాండ్‌లో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త పరిస్థితులకు ఆజ్యం పోసింది. ‘ఓపెన్ బోర్డర్ పాలసీ’ (అపరిమిత వలసల విధానం)కి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ‘ఐర్లాండ్ ఫర్ ద ఐరిష్’ (ఐరిష్ ప్రజలకే ఐర్లాండ్) అని నినాదాలు చేస్తున్నారు. వైవిధ్యం పేరుతో దేశ మూల గుర్తింపును పణంగా పెట్టే అధికారులను సహించేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.
