“ఈ లోకం ఎటు పోతోంది..!” ప్రేమించడం నేరమా..? ప్రేమ జంటకు నడిరోడ్డుపై గుండు గీసి దారుణంగా దాడి.. నడిరోడ్డుపై జరిగిన అన్యాయం.. గుండెను కలచివేసే వీడియో..!!

రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో ప్రేమించుకున్న యువతీయువకులను గ్రామస్తులంతా కలిసి అత్యంత దారుణంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

సామాజిక కట్టుబాట్లను దాటి ప్రేమించుకున్నారనే కారణంతో ఆ జంటను చుట్టుముట్టిన గ్రామస్తులు, ఇకపై మరెవరూ ప్రేమించాలనే ఆలోచన కూడా చేయకూడదనే ఉద్దేశంతో వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

అందరి ముందూ నడిరోడ్డుపై వారిని చితకబాదడమే కాకుండా, ఇద్దరికీ బలవంతంగా గుండు గీశారు. ఈ అమానుష ఘటనను అక్కడే ఉన్న కొందరు తమ సెల్‌ఫోన్లలో వీడియో తీశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రూరల్ ఎస్పీ ఈ ఘటనపై స్పందించి విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

‘ప్రేమించుకున్నందుకు అందరి ముందూ ఇలా అవమానిస్తారా?’ అని, ‘ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా మనుషుల వెనుకబాటుతనం మాత్రం మారడం లేదు’ అంటూ ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *