సోషల్ మీడియాలో ఎన్నో రాజకీయ పేజీలు నడుస్తున్నప్పటికీ, తాజాగా ఈగ (Fly) ఎమోజీతో ‘మక్కీ జనతా పార్టీ’ పేరుతో పూర్తిగా భిన్నమైన కొత్త రాజకీయ ఉద్యమం ఆన్లైన్లో తన కార్యకలాపాలను వేగవంతంగా ప్రారంభించింది.
ఇప్పటికే వింత పేర్లతో కొన్ని ఆన్లైన్ ఉద్యమాలు ఉన్న నేపథ్యంలో, నెట్టింట ఫేమస్ అయిన ‘బొద్దింక పార్టీ’ లాగానే వ్యంగ్యంగా, విభిన్నంగా ప్రారంభమైన ఈ ‘మక్కీ జనతా పార్టీ’ నెటిజన్ల దృష్టిని ఎంతగానో ఆకర్షించింది.
ఈ కొత్త ఆన్లైన్ రాజకీయ పేజీ తమను తాము పరిచయం చేసుకుంటూ, ఇది పూర్తిగా యువత ద్వారా, యువత కోసమే నడుస్తున్న కొత్త రాజకీయ ఉద్యమం అని గర్వంగా పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో యువత ఆలోచనలను ముందుకు తీసుకెళ్లేందుకు, విభిన్న పద్ధతిలో ప్రజల్లోకి తమ భావాలను వ్యాప్తి చేసేందుకే ఈ ఆన్లైన్ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా, తమ పేజీకి గుర్తుగా ఈగ ఎమోజీని వాడుతుండటమే కాకుండా, వీరు పోస్ట్ చేస్తున్న వింతైన వ్యాఖ్యలు, మీమ్స్ ప్రస్తుతం నెటిజన్లలో తెగ వైరల్ అవుతున్నాయి. బొద్దింక పార్టీని ఆదర్శంగా తీసుకుని ప్రారంభమైనట్లు చెబుతున్న ఈ మక్కీ జనతా పార్టీ రాక, ఆన్లైన్ రాజకీయ క్షేత్రంలో పెద్ద చర్చను రేపుతూనే మరోవైపు నవ్వులను పూయిస్తోంది.

Leave a Reply