“ఎందుకు ఎదురు మాట్లాడలేదు.?” చెంప దెబ్బ కొట్టిన భర్త.! ప్రశాంతంగా భార్య చెప్పిన సమాధానం.. నెటిజన్లను ఆశ్చర్యపరిచిన పోస్ట్.!!

రోజంతా పని చేసి అలసటతో ఇంటికి తిరిగి వచ్చిన భర్త, వంట చేయకపోవడం చూసి తీవ్ర ఆగ్రహానికి గురై భార్య చెంపపై కొట్టాడు.

దీంతో ఆ భార్య ఇంటి ఒక మూలన కూర్చుని నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంది. వంట చేయకపోవడానికి గల కారణాన్ని భర్త కోపంగా అడిగినప్పుడు, తనకు ఒళ్లు బాగుండకపోవడం వల్ల నిద్రపోయానని, అందుకే ఆహారం తయారీ చేయలేకపోయ్యానని ఆ మహిళ చాలా ప్రశాంతంగా చెప్పింది.

తన భర్త కొట్టిన తర్వాత కూడా భార్య కోపపడకుండా మౌనం వహించడం చూసి ఆశ్చర్యపోయిన భర్త, “ఎందుకు ఎదురు మాట్లాడలేదు?” అని అడిగాడు. దానికి ఆ మహిళ, “భర్త కోపంగా ఉన్నప్పుడు ఎదురు మాట్లాడకూడదనేది నా తల్లిదండ్రులు ఇచ్చిన పెంపకం” అని పేర్కొంది. కుటుంబ బంధాలు నిలిచిపోవాలంటే, ఇద్దరూ ఒకరి పరిస్థితిని, భావాలను మరొకరు అర్థం చేసుకోవాలని తెలియజేసే ఈ కథ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags: