నేడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఎలుకల బెడద ఒకటి. ఇవి బట్టలు, విలువైన పత్రాలను కొరికి పాడుచేయడమే కాకుండా ప్రాణాంతక వ్యాధులకు కూడా కారణమవుతాయి.
సాధారణంగా మనం ఎలుకలను చంపడానికి విషం లేదా బోన్లను వాడుతుంటాము. అయితే ఎలుకలు చనిపోయి కుళ్ళిపోతే వచ్చే దుర్వాసన మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి వాటిని చంపకుండా ఇంట్ నుండి తరిమికొట్టే కొన్ని సహజసిద్ధమైన మార్గాలను చూద్దాం:
- పుదీనా ఆకులు: ఎలుకలు పుదీనా యొక్క గాఢమైన వాసనను భరించలేవు. పుదీనా ఆకులను లేదా ‘పెప్పర్ మింట్ ఆయిల్’లో ముంచిన దూది ఉండలను ఎలుకలు వచ్చే మూలల్లో ఉంచితే అవి రాకుండా ఉంటాయి.
- మిరియాలు: మిరియాల పొడి వాసన ఎలుకల శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అవి తిరిగే దారుల్లో లేదా రంధ్రాల దగ్గర మిరియాల పొడిని చల్లడం వల్ల ఆ ప్రాంతానికి రాకుండా అడ్డుకోవచ్చు.
- వెల్లుల్లి: వెల్లుల్లిని నీటిలో వేసి బాగా మరిగించి, ఆ ద్రావణాన్ని ఇంటి బయట మరియు ఎలుకల రంధ్రాల వద్ద చల్లితే అవి లోపలికి రావు.
- లవంగాలు: లవంగాలు లేదా లవంగాల నూనెను వాడటం ద్వారా కూడా ఎలుకలను దూరం పెట్టవచ్చు.
- ఇంగువ: ఇంగువ యొక్క ఘాటైన వాసన అంటే ఎలుకలకు అస్సలు ఇష్టం ఉండదు. ఇంగువను నీటిలో కలిపి రంధ్రాల వద్ద పోస్తే ఎలుకలు ఆ స్థలాన్ని వదిలి వెళ్ళిపోతాయి.
