“ఎవరా G?”.. భార్య చేతిపై టాటూ చూసి అనుమానం.. ఎంత చెప్పినా వినకుండా తల నరికి చంపిన భర్త!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో 48 ఏళ్ల ప్రదీప్ మిశ్రా, తన కంటే 24 ఏళ్లు చిన్నదైన భార్య లక్ష్మిని అనుమానంతో హత్య చేశాడు. ఆమె చేతిపై ఉన్న ఒక అక్షరం టాటూనే ఈ ఘోరానికి కారణమైంది.

ఏం జరిగింది? ఆటో డ్రైవర్ అయిన ప్రదీప్ మిశ్రా క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తి. గతంలో హత్యాయత్నం (307) కేసులో జైలుకు కూడా వెళ్ళాడు. తన భార్య లక్ష్మికి మరొకరితో సంబంధం ఉందని అతను అనుమానించేవాడు. ఆమె ఒక చేతిపై ‘P’ మరియు ‘L’ (ప్రదీప్, లక్ష్మి) అని ఉండగా, మరో చేతిపై ‘G’ మరియు ‘L’ అని టాటూ ఉంది. “ఈ G అంటే ఎవరు?” అని అతను తరచూ తాగొచ్చి గొడవ పడేవాడు.

హత్య జరిగిన తీరు: డిసెంబర్ 19న జౌన్‌పూర్ లోని తన సోదరి ఇంటికి వెళ్ళిన సమయంలో మళ్ళీ ఇదే విషయంపై గొడవ జరిగింది. లక్ష్మి కోపంతో “G అంటే గుడ్డు (ప్రదీప్ ఇంట్లో పిలిచే పేరు)” అని చెప్పినా అతను నమ్మలేదు. రాత్రి 11 గంటలకు టీ తాగిద్దామని భార్యను బయటకు తీసుకెళ్లి, దారిలో మఫ్లర్‌తో గొంతు నులిమి చంపేశాడు. గుర్తు పట్టకుండా ఉండాలని సిమెంట్ రాయితో ముఖాన్ని చిధ్రం చేసి, మృతదేహాన్ని ఎండు గడ్డి కుప్పలో దాచిపెట్టాడు.

టాటూతోనే దొరికిపోయాడు: పోలీసులకు గుర్తుతెలియని మహిళ శవం దొరికినప్పుడు, ఆమె చేతులపై ఉన్న టాటూలే కీలక ఆధారాలయ్యాయి. లక్ష్మి అదృశ్యమైనట్లు గుర్తించిన పోలీసులు, పరారీలో ఉన్న ప్రదీప్‌ను టెక్నికల్ సర్వైలెన్స్ ద్వారా పట్టుకున్నారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అతడిని జైలుకు పంపారు.


Posted

in

by

Tags: