ఎవరీ నేహా గుప్తా? 4 ఏళ్ల కుమార్తెను ఊపిరి ఆడకుండా చేసి చంపి, ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని 9 అడుగుల లోతున్న పూల్‌లో పడేసిన భారత సంతతి డాక్టర్.

ఒక పీడియాట్రీషియన్ (పిల్లల డాక్టర్) తన 4 ఏళ్ల కుమార్తెను చంపి, ఆపై ఆ చిన్నారి మృతదేహాన్ని ఈత కొలనులో కనుగొన్నట్లు 911 అత్యవసర సేవల నంబర్‌కు ఫోన్ చేసిన ఆడియో రికార్డింగ్‌లు ఇప్పుడు బయటపడ్డాయి. ఈ ఘటన నేహా గుప్తాపై హత్యారోపణలకు దారితీసింది.

డాక్టర్ నేహా గుప్తా తన కుమార్తె ‘ఆర్య తలతీ’ మరణానికి కారకురాలని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జూన్ 27, 2025న ఫ్లోరిడాలోని ఒక అద్దె ఇంట్లో ఈ చిన్నారి మృతదేహం లభించింది. తన కుమార్తె రాత్రిపూట ఇంటి నుండి బయటకు వచ్చి అనుకోకుండా పూల్‌లో పడిపోయిందని నేహా గుప్తా అప్పట్లో పోలీసులకు చెప్పారు.

911 కాల్‌లో ఏం ఉంది? కొత్తగా విడుదలైన ఆడియో రికార్డింగ్‌ల ప్రకారం.. “నేను తనను బయటకు తీయడానికి ప్రయత్నించాను. మేము నిద్రపోతున్నప్పుడు ఏదో శబ్దం వినిపించింది. తను పూల్‌లో ఉంది, కాపాడదామని చూశాను కానీ నాకు ఈత రాదు” అని నేహా డిస్పాచర్‌తో చెప్పారు. డిస్పాచర్ ఆమెను పాపను నీటి నుండి బయటకు తీయమని పదేపదే కోరగా, “తను పూల్ అడుగున ఉంది, కదలడం లేదు” అని నేహా సమాధానం ఇచ్చారు. 9 అడుగుల లోతులో ఉండటం వల్ల తాను తీయలేకపోతున్నానని ఆమె నాటకమాడారు.

ముఖ్యమైన మలుపు: పోలీసుల దర్యాప్తులో ఈ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారి ఊపిరితిత్తుల్లో నీరు లేదని, అంటే తను మునిగి చనిపోలేదని పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. మొదట చిన్నారిని ఊపిరి ఆడకుండా చేసి చంపి (Smothering), ఆ తర్వాత ప్రమాదంగా చూపించడానికి మృతదేహాన్ని పూల్‌లో పడేసినట్లు పోలీసులు నిర్ధారించారు.


Posted

in

by

Tags: