“ఎవరైనా మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారా.?” ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు.! కనిపెట్టడానికి సరికొత్త వెబ్‌సైట్‌ను రూపొందించిన 22 ఏళ్ల యువకుడు.!!

ముంబైకి చెందిన 22 ఏళ్ల AI ఇంజనీర్ వత్సల్, అవతలి వ్యక్తికి తెలియకుండానే వారు మనల్ని ఇష్టపడుతున్నారో లేదో రహస్యంగా తెలుసుకునేందుకు makeoutwithfriends.lol అనే సరికొత్త వెబ్‌సైట్‌ను రూపొందించారు.

ఈ వెబ్‌సైట్ పనిచేసే విధానం చాలా సులభం. యూజర్లు తమకు నచ్చిన వ్యక్తి ఫోన్ నంబర్‌ను ఈ సైట్‌లోని రహస్య జాబితాలో యాడ్ చేయాలి. అవతలి వ్యక్తి మిమ్మల్ని తన జాబితాలో చేర్చనంత వరకు వారికి ఎలాంటి సమాచారమూ తెలియదు. ఒకవేళ వారు కూడా మీ ఫోన్ నంబర్‌ను ఈ వెబ్‌సైట్‌లో యాడ్ చేస్తే మాత్రమే, ఇద్దరికీ “మ్యాచ్ (Match)” అయినట్లు నోటిఫికేషన్ వెళ్లి మాట్లాడుకోవడానికి మార్గం సుగమమవుతుంది.

“ఎవరికీ ప్రత్యక్షంగా ఎదురెళ్లి చెప్పే సంకోచం గానీ, ఇబ్బంది గానీ కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ సైట్‌ను ఉచితంగా రూపొందించాను” అని వత్సల్ తెలిపారు. ఆయన చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో యువత, నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.


Posted

in

by

Tags: