విదేశాల్లో ఉద్యోగం చేసే బీహార్కు చెందిన మనోజ్ యాదవ్, ఇటీవల స్వగ్రామానికి వచ్చి ఒక సరికొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.
ఆ కారును నడపడానికి ఒక డ్రైవర్ను కూడా నియమించుకున్నాడు. అయితే, ఆ డ్రైవర్ హఠాత్తుగా పని మానేయడంతో, లగ్జరీ కారును ఇంటి ముందే ఖాళీగా పార్క్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాధారణంగా దొంగల భయంతో సైకిళ్లు, బైకులను ఇంటి లోపల దాచి తాళం వేసినట్లుగా.. ఇంటి ముందు పార్క్ చేసిన తన సరికొత్త కారును అర్ధరాత్రి ఎవరైనా ఎత్తుకెళ్లిపోతారేమోనని మనోజ్ యాదవ్ తీవ్రంగా భయపడ్డాడు.
ఈ భయం కొద్దీ కారును కాపాడుకోవడానికి ఆయనొక విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఒక భారీ క్రేన్ సహాయంతో ఆ లగ్జరీ కారును పైకి లేపి, తన ఇంటి డాబా (టెర్రస్) పైకి చేర్చి భద్రంగా పార్క్ చేశాడు. ఆ వీధి గుండా వెళ్లే స్థానికులు, బాటసారులు డాబాపై ఠీవిగా నిలిచివున్న కారును చూసి నిశ్చేష్టులయ్యారు.
