ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక శాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ, వేగంగా కదులుతున్న రైలు తలుపు వద్ద నిలబడి, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లుగా రీల్ వీడియో తీసుకుంటోంది.
వీడియోలో ఆ మహిళ రైలు తలుపు నుండి బయటకు వేలాడుతూ, ముఖం పైన చిరునవ్వుతో కెమెరాకు పోజులు ఇస్తుండగా, వెనుక మరికొంత మంది యువకులు కూడా అదే విధంగా అతిగా సాహసిస్తూ కనిపిస్తున్నారు.
ప్రమాదకరమైన రీల్ – మరణంతో ఆట?
ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. “ఇది సినిమా సీన్ కాదు, ఇది నిజం..!” అంటూ కామెంట్లు పెట్టారు. మహిళ చీర గాలిలో ఎగురుతూ కనిపించడం, ఆమె ఊయల మాదిరిగా ఊగడం వంటివి చాలా మందికి ఇది డైరెక్షన్‌తో తీర్చిదిద్దిన వీడియోలాగే అనిపించింది.
కానీ రైల్వే నిబంధనల ప్రకారం, చలిస్తున్న రైలు తలుపు వద్ద నిలబడటం, లేదా బయటకు వేలాడటం కఠినంగా నిషేధించబడిన చర్య. ఇది ఆమెకు మాత్రమే కాకుండా రైలులో ప్రయాణిస్తున్న ఇతరులకు కూడా జీవహానికీ కారణం కావచ్చు.
Leave a Reply