వేసవి కాలం ప్రారంభం కాకముందే ఎండలు మండిపోతున్నాయి. అగ్ని నక్షత్రం రాకముందే ప్రజలు భానుడి భగభగలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ వేడి నుండి తప్పించుకోవడానికి చాలా ఇళ్లలో ఏసీలు నిరంతరం నడుస్తూనే ఉన్నాయి. అయితే ఏసీ ఏ వేగంతో తిరుగుతుందో, కరెంట్ మీటర్ కూడా అదే వేగంతో పరిగెడుతోంది. నెలాఖరులో వచ్చే కరెంట్ బిల్లు చూసి సామాన్యులకు తల తిరుగుతోంది. దీనికి పరిష్కారం లేదా? కరెంట్ బిల్లును ఎలా తగ్గించుకోవాలి? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఏసీ కరెంట్ బిల్లు తగ్గించే రహస్యం: నిజానికి మీ ఏసీ రిమోట్‌లో ఉండే ఒక చిన్న బటన్‌ను సరిగ్గా ఉపయోగిస్తే, మీ విద్యుత్ బిల్లును గణనీయంగా ఆదా చేయవచ్చు. సాధారణంగా మనం ఏసీ ఆన్ చేయగానే ‘కూల్ మోడ్’ (Cool Mode) నే వాడుతుంటాం. కానీ ఎండ ఎక్కువగా ఉండి, గాలిలో తేమ (Humidity) ఎక్కువగా ఉన్నప్పుడు మీరు రిమోట్‌లో ‘డ్రై మోడ్’ (Dry Mode) ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది.
- ఎందుకు డ్రై మోడ్?: ఇది గాలిలోని తేమను పీల్చుకుని, గదిని త్వరగా చల్లబరుస్తుంది. దీనివల్ల కంప్రెసర్ ఎక్కువ సమయం పని చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా విద్యుత్ వినియోగం భారీగా తగ్గుతుంది. ఇది చాలా మందికి తెలియని రహస్యం.
విద్యుత్ శాఖ సూచనలు: ఏసీ ఉష్ణోగ్రతను ఎప్పుడూ 24°C లేదా 26°C వద్ద ఉంచడం ఉత్తమమైన పద్ధతి. మనం తొందరగా చల్లబడాలని 16°C లేదా 18°C వద్ద ఉంచినంత మాత్రాన గది వెంటనే కూల్ అయిపోదు.
- నష్టం: తక్కువ టెంపరేచర్ వద్ద ఆ ఉష్ణోగ్రతను చేరుకోవడానికి కంప్రెసర్ చాలా కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల కరెంట్ రెప్పపాటులో ఖర్చవుతుంది.
- చిట్కా: మీరు ఏసీని 24°C వద్ద ఉంచి, గదిలోని ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో వేస్తే, చల్లని గాలి గది అంతా సమానంగా వ్యాపిస్తుంది. ఇది మీకు కావాల్సిన చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా, కరెంట్ బిల్లును కూడా సగానికి తగ్గిస్తుంది.
ఏసీ నిర్వహణ (Maintenance) ముఖ్యం: మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏసీ సర్వీసింగ్. ఏసీ లోపల ఉండే ఫిల్టర్లను వారంకోసారి మీరే తీసి శుభ్రం చేయాలి. ఒకవేళ ఫిల్టర్లలో దూళి పేరుకుపోతే, గాలిని బయటకు పంపడానికి ఏసీ ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. ఇది టైర్ పంచర్ అయిన కార్‌ను నడపడం లాంటిది.
