ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భార్యకు తెలియకుండా మరో మహిళను కలిసేందుకు వెళ్లిన భర్తను.. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నడిరోడ్డుపైనే నిలదీసిన ఘటన కలకలం రేపింది.
బ్రిజ్ఘాట్ ప్రాంతానికి చెందిన అజయ్, కవితకు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే అజయ్ తరచూ ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి మరో మహిళను కలవడానికి వెళ్తున్నాడనే ఆరోపణలతో వారి కుటుంబంలో చాలాకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో అజయ్ బ్రిజ్ఘాట్లోని ఓ హోటల్ సమీపంలో ఉన్నాడని తెలుసుకున్న కవిత.. తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లారు.
అక్కడ అజయ్ ఓ దుకాణంలో రెండు ప్లేట్ల ఛోలే భటూరే కొనుగోలు చేసి పార్సిల్ చేయించుకుంటున్నట్లు కవిత గమనించారు. వెంటనే అతడిని అడ్డుకుని ప్రశ్నలు వేయడంతో అక్కడ వాగ్వాదం మొదలైంది. దీంతో నడిరోడ్డుపై పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడి, విషయం చూసేందుకు స్థానికులు కూడా భారీగా గుమిగూడారు.
తన భార్య ప్రశ్నలకు సమాధానమిస్తూ అజయ్.. తాను ఎలాంటి మహిళను కలవడానికి రాలేదని, కుటుంబ సమస్యల కారణంగా మానసిక ఒత్తిడికి గురై ఒంటరిగా ఇక్కడికి వచ్చానని చెప్పినట్లు సమాచారం.
అయితే భార్య మాత్రం…
“ఒంటరిగా వచ్చానని చెబుతున్నావు కదా.. మరి రెండు ప్లేట్ల ఛోలే భటూరే ఎందుకు పార్సిల్ తీసుకున్నావు?” అంటూ వరుస ప్రశ్నలు వేయడంతో అజయ్ ఇబ్బందికర పరిస్థితిలో పడ్డాడు.
ఇలా కొంతసేపు నడిరోడ్డుపై వాగ్వాదం కొనసాగింది. చివరకు ఈ వ్యవహారం బ్రిజ్ఘాట్ పోలీస్ స్టేషన్కు చేరింది.
పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్కు పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. చాలాసేపు చర్చించిన అనంతరం భార్యాభర్తల మధ్య రాజీ కుదరడంతో వారు తిరిగి తమ ఇంటికి వెళ్లిపోయారు.
రెండు ప్లేట్ల ఆహార పార్సిల్ చుట్టూ మొదలైన ఈ కుటుంబ వివాదం.. చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

Leave a Reply