ఒక కిలో నిమ్మకాయలు ₹850. ఒక కీరదోసకాయ ₹300.! నార్వేలో కూరగాయల ధరలు వింటే తలతిరుగుతుంది.! కానీ ఇండియాతో పోల్చిన తర్వాత రైతుల ఆదాయంపై మొదలైన కొత్త చర్చ.!!!

నార్వేలో కూరగాయల ధరలకు సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ ఒక కిలో నిమ్మకాయలు సుమారు ₹850, ఒక కీరదోసకాయ సుమారు ₹300 అని పేర్కొనగా, దీనిని ఇండియాతో పోలుస్తూ చాలా మంది నెటిజన్లు చర్చిస్తున్నారు.

నార్వేలో సుదీర్ఘకాలంగా నివసిస్తున్న ఒక భారతీయుడు పంచుకున్న సమాచారం ప్రకారం.. అక్కడ సేంద్రియ (Organic) పద్ధతిలో పండించిన నిమ్మకాయలు కిలో సుమారు ₹850, టమోటాలు కిలో సుమారు ₹680, మరియు ఒక కీరదోసకాయ సుమారు ₹300 గా ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో భారతదేశంలోని పెద్ద నగరాల్లో కిలో నిమ్మకాయలు ₹90 నుంచి ₹110 వరకు, టమోటాలు కిలో ₹60 నుంచి ₹80 వరకు, ఒక కీరదోసకాయ ధర సుమారు ₹20 నుంచి ₹30 వరకు ఉంటుందని ఆ పోలికలో తెలిపారు.

ఈ ధరల వ్యత్యాసాన్ని చూసిన తర్వాత, భారతదేశంలో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర పొందుతున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తింది. వినియోగదారులు చెల్లించే మొత్తంలో రైతులకు చాలా తక్కువ మాత్రమే దక్కుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దళారులు, వ్యాపారులకే ఎక్కువ లాభం వెళుతోందని వారు అంటున్నారు.

అదే సమయంలో, నార్వే మరియు భారతదేశ ఆర్థిక స్థితి, జీతాలు, జీవన వ్యయం మరియు కొనుగోలు శక్తి (Purchasing power) ఒక్కటి కాదని కొందరు ఎత్తిచూపుతున్నారు. అందువల్ల, రెండు దేశాల కూరగాయల ధరలను మాత్రమే తీసుకుని నేరుగా పోల్చడం సరికాదనేది సోషల్ మీడియాలో వినిపిస్తున్న మరో వాదన. ఏది ఏమైనా, నార్వే కూరగాయల ధరల గురించి వచ్చిన ఈ పోస్ట్, భారతదేశంలో రైతుల ఆదాయం మరియు దళారుల పాత్రపై ఒక కొత్త చర్చకు తెరతీసింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *