ఒక భార్య, ఇద్దరు భర్తలు; నడిరోడ్డుపై తన్నులాట; యువతి సమాధానం విని విస్తుపోయిన స్థానికులు

లక్నో: ఒక మహిళ కోసం ఇద్దరు యువకులు వీధిలో బాహాబాహీకి దిగారు. సదరు యువతి తన భార్య అంటే తన భార్య అని ఇద్దరూ వాదించుకుంటూ గొడవపడ్డారు.

యూపీలోని బిజ్నోర్ జిల్లా నాగర్ పాలిక చౌక్ వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. చివరకు ఈ గొడవలో తలదూర్చిన స్థానికులు, ఆ యువతి చెప్పిన సమాధానం విని షాక్‌కు గురయ్యారు.

అసలేం జరిగిందంటే: సాయంత్రం వేళ ఒక యువతి, ఒక యువకుడితో కలిసి బైక్‌పై స్క్వేర్ వద్దకు చేరుకుంది. అదే సమయంలో మరో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకుల్లో ఒకరు.. ఆ మహిళ తన భార్య అని క్లెయిమ్ చేశాడు. “నా భార్యను వెంటబెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు?” అని నిలదీశాడు. అయితే, ఆమె తన భార్య అని యువతితో ఉన్న వ్యక్తి సమాధానమిచ్చాడు.

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకరినొకరు దూషించుకుంటూ కొద్దిసేపటికే దాడులకు దిగారు. ఒక యువకుడు తన బెల్టు తీసి రెండో వ్యక్తిని కొట్టగా, ఇద్దరూ పరస్పరం పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ గొడవ చూసి జనం భారీగా గుమిగూడారు. స్థానికులు వారిని విడదీయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

యువతి సమాధానం: విషయం ఏంటని ఆరా తీయగా.. ఒక యువకుడు మాట్లాడుతూ, ఆమె తన భార్య అని, తమ మధ్య గొడవలు ఉన్న మాట నిజమే కానీ ఇప్పటికీ విడాకులు తీసుకోలేదని చెప్పాడు. అయితే, ఆ మహిళ మాత్రం తనతో ఉన్న యువకుడే తన భర్త అని తేల్చి చెప్పింది. దీంతో అక్కడ ఉన్న వారంతా అయోమయంలో పడిపోయారు. చాలా సేపు రభస జరిగిన తర్వాత, స్థానికులు సర్దిచెప్పడంతో ముగ్గురూ అక్కడి నుండి వెళ్ళిపోయారు.


Posted

in

by

Tags: