సోషల్ మీడియాలో మొదలైన స్నేహం.. ఆపై త్రికోణ ప్రేమగా మారి.. చివరకు ఒక భయంకరమైన హత్యతో ముగిసి తీవ్ర కలకలం రేపింది. తన భర్తకు దూరంగా ఉంటున్న రీనా కిరార్ అనే మహిళకు ఫేస్బుక్ (Facebook) ద్వారా రాజస్థాన్‌లోని భీల్వాడా నివాసి అయిన వీరూ జాట్తో పరిచయం ఏర్పడింది. అయితే రీనాకు అంతకుముందే అరుణ్ పటేల్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉంది. అతడే ఆమె ఇంటి ఖర్చులన్నీ చూసుకునేవాడు. ఈ క్రమంలో రీనా, వీరూ జాట్ల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం గురించి తెలిసిన అరుణ్ పటేల్ తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా వీరూ జాట్‌ను తన దారి నుండి తప్పించాలని ఒక ఘోరమైన కుట్రకు తెరలేపాడు.
పాత ప్రియుడితో కలిసి బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టి చంపిన వైనం
నరసింహపూర్: మధ్యప్రదేశ్‌లోని నరసింహపూర్ జిల్లా నుండి అందరినీ ఉలిక్కిపడేలా చేసిన ఒక సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఒక రాజస్థాన్ యువకుడి స్నేహం.. మహిళ యొక్క పాత ప్రియుడికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీనితో అతడు ఆ మహిళతో కలిసే కొత్త ప్రియుడి హత్యకు ప్లాన్ వేశాడు. ప్రేమ పేరిట ఆ యువకుడిని ఇంటికి పిలిపించి, బేస్‌బాల్ బ్యాట్‌తో దారుణంగా కొట్టి చంపేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
చాలా కాలంగా భర్తకు దూరంగా ఉంటున్న రీనా కిరార్‌కు ఫేస్బుక్ ద్వారా రాజస్థాన్ భీల్వాడాకు చెందిన వీరూ జాట్ పరిచయమయ్యాడు. వీరిద్దరి మధ్య మాటలు కలవడంతో వీరూ జాట్ తరచూ రీనా ఇంటికి రావడం ప్రారంభించాడు. ఈ విషయం రీనా పాత ప్రియుడైన అరుణ్ పటేల్‌కు తెలిసింది. దీనిని అతడు అస్సలు భరించలేకపోయాడు. దీనితో అరుణ్, రీనా కలిసి ఒక ప్లాన్ ప్రకారం వీరూ జాట్‌ను నరసింహపూర్ జిల్లాలోని సాయిఖేడాలో ఉన్న ఇంటికి పిలిపించారు. అక్కడ అతడిని దారుణంగా హత్య చేసి, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని రాయ్‌సేన్ జిల్లా బాడీ ప్రాంతంలోని తేడియా వంతెన (నాగిన్ మోడ్ సిర్వారా బ్రిడ్జ్) కింద పడేశారు. పోలీసులు ఈ గుట్టు రట్టు చేసి నిందితురాలైన రీనా కిరార్, ఆమె పాత ప్రియుడు అరుణ్ పటేల్, అతనికి సహకరించిన హరినామ్ కిరార్లను అరెస్ట్ చేశారు.
కొత్త అఫైర్ తట్టుకోలేకపోయిన పాత ప్రియుడు
పోలీస్ సూపరింటెండెంట్ (SP) అశుతోష్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు రీనా కిరార్ భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. గతంలో ఆమెకు అరుణ్ పటేల్‌తో ప్రేమ సంబంధం ఉండేది. అయితే ఇటీవల ఫేస్బుక్ ద్వారా రాజస్థాన్‌కు చెందిన వీరూ జాట్తో పరిచయం పెరిగి, అతడు ఇంటికి రావడంపై అరుణ్ పటేల్ తీవ్ర కక్ష పెంచుకున్నాడు. అరుణ్ పటేలే రీనా ఇంటి ఖర్చులన్నీ భరిస్తూ ఉండటంతో, వీరూ రాకను అతడు తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ క్రమంలోనే వీరూ జాట్‌ను శాశ్వతంగా దారి నుండి తప్పించడానికి రీనాతో కలిసి కుట్ర పన్నాడు.
సినిమా ఫక్కీలో హత్యకు స్కెచ్
ఎస్పీ అశుతోష్ గుప్తా కథనం ప్రకారం.. 29 ఏప్రిల్ 2026 న రీనా ఒక ప్లాన్ ప్రకారం వీరూను రాజస్థాన్ నుండి సాయిఖేడాలోని తన ఇంటికి రప్పించింది. అప్పటికే ఆ ఇంట్లో మిగిలిన నిందితులు సిద్ధంగా ఉన్నారు. వీరూ ఇట్లోకి అడుగుపెట్టగానే అందరూ కలిసి ముందుగా అనుకున్న వ్యూహం ప్రకారం బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేసి అక్కడికక్కడే హతమార్చారు. హత్య అనంతరం మృతదేహాన్ని ఒక గోనె సంచిలో కుక్కి, తమ కారు డిక్కీలో వేసుకున్నారు. అక్కడ నుండి సాయిఖేడా తీసుకొచ్చి సిర్వారా వంతెన కింద పడేశారు.
ఆ తర్వాత పోలీసుల నుండి తప్పించుకోవడానికి నిందితులు బాడీ నుండి ఇటార్సీ, అక్కడి నుండి ముంబై (కల్యాణ్), ఆపై ఇండోర్ మరియు ఉజ్జయినిలలో నిరంతరం ఇళ్లు మారుస్తూ దాక్కున్నారు. చివరకు పోలీసులు వారిని పట్టుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
