నెలకు ₹41,000 జీతంతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన శశాంక్ మిశ్రా అనే యువకుడు, తన కష్టపడే తత్వం మరియు నిరంతర అభ్యాసంతో నేడు సంవత్సరానికి ₹1 కోటికి పైగా సంపాదించే స్థాయికి చేరుకున్నాడు.
సక్రమమైన ప్రణాళిక, సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలే ఇతని ఈ మెగా విజగానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
అలహాబాద్ నిట్ (NIT) కళాశాలలో ఎంసీఏ (MCA) పూర్తి చేసిన శశాంక్, 2017లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా తన మొదటి ఉద్యోగంలో చేరాడు. అప్పుడు అతనికి వచ్చిన నెల జీతం కేవలం ₹41,000 మాత్రమే. అయితే, రోజువారీ పనితోనే ఆగిపోకుండా, సాంకేతిక రంగంలో రాబోయే మార్పులను అతను నిశితంగా పరిశీలించడం ప్రారంభించాడు.
భవిష్యత్తు ‘డేటా’ ఆధారిత సాంకేతికతదేనని ముందుగానే ఊహించిన అతను, తన దృష్టిని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నుండి ‘డేటా ఇంజనీరింగ్’ వైపు మళ్లించాడు. ఈ ఒక్క దూరదృష్టి నిర్ణయంతో పేటీఎమ్, అమెజాన్, ఎక్స్పీడియా వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసే అరుదైన అవకాశాలు అతన్ని వెతుక్కుంటూ వచ్చాయి.
కేవలం కాలేజీ డిగ్రీపైనే ఆధారపడకుండా క్లౌడ్, ఏఐ (AI), డేటాబేస్ సహా డేటా ఇంజనీరింగ్‌కు సంబంధించిన 79 రకాల కొత్త సాంకేతిక నైపుణ్యాలను నిరంతరం నేర్చుకుని నైపుణ్యం సాధించాడు. ఈ నిరంతర స్వయం అభివృద్ధి ఫలితంగా, ప్రస్తుతం ఒక ప్రముఖ సంస్థలో సీనియర్ డేటా ఇంజనీర్‌గా ఎదుగుతూ, సంవత్సరానికి ₹1 కోటికి పైగా జీతాన్ని అందుకంటూ రికార్డు సృష్టించాడు.
ఒకే రాత్రిలో ఈ ఎదుగుదల సాధ్యం కాలేదని, మార్కెట్ అవసరాలను గుర్తించి మన నైపుణ్యాలను పెంచుకుంటే వేతన పెంపు అనే పరిమితులను సులభంగా దాటవచ్చని శశాంక్ నిరూపించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇతని విజయాగాథ, ఉద్యోగార్ధులకు మరియు ఐటీ రంగంలో ఉన్నవారికి గొప్ప ప్రేరణగా నిలుస్తోంది.

Leave a Reply