యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో సీనియర్ క్లౌడ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల భారత సంతతి మహిళ పుష్పజ్యోతి రవికుమార్.. ఒక చిన్న స్టిక్కీ నోట్‌పై ఏకంగా 150 వేర్వేరు పదాలను రాసి సరికొత్త ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ నెలకొల్పారు.
దుబాయ్‌లో జరిగిన ఈ రికార్డ్ ఫీట్లో.. అతి తక్కువ స్థలంలో, ఎక్కువ పదాలను స్పష్టంగా మరియు చదవగలిగే విధంగా రాయాలనే నిబంధనను ఆమె సవాలుగా తీసుకున్నారు.
ఇందుకోసం ఆమె ఎక్కువగా 3 అక్షరాలు కలిగిన చిన్న పదాలను ఎంచుకుని, తన అద్భుతమైన చేతిరాత నైపుణ్యంతో మొదటి ప్రయత్నంలోనే ఈ ఘనతను సాధించారు. చిన్నప్పటి నుంచే గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాలనే తన చిరకాల కలను ఎట్టకేలకు నిజం చేసుకున్నానని పుష్పజ్యోతి ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అది ఇప్పటికే 10 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Leave a Reply